
Kaziah Liz Mejo కేరళ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల యువతి ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకుంది. జైపూర్లో ఘనంగా జరిగిన ఈ వేడుకలో దేశవ్యాప్తంగా ఉన్న అందాల పోటీదారులను వెనక్కి నెట్టి ఆమె ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. తన జీవితంలో ఇది ఎప్పటికీ మర్చిపోలేని అరుదైన అవకాశం అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
Kaziah Liz Mejo wins crown
పోటీ జరిగే సమయంలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు కజియా తెలిపారు. అనారోగ్యం, సొంత ఊరు దూరమయ్యామనే బాధ, అలాగే తనపై తనకు కలిగిన ఆత్మన్యూతతా భావాన్ని అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆమె వెల్లడించారు. కష్టమైన సమయాలలో కూడా వెనకడుగు వేయకుండా మరింత కష్టపడటం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆమె స్పష్టం చేశారు.
ఈ కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా తన చిరకాల కల నెరవేరిందని కేరళకు చెందిన ఈ యంగ్ బ్యూటీ ఆనందం వ్యక్తం చేశారు. పోటీల్లో పాల్గొనే క్రమంలో ఎదురైన ప్రతి సవాల్ తనకు ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సహకారంతోనే తాను ఈ విజయాన్ని సాధించగలిగానని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా నిలిచిన కజియా లిజ్ మెజో మొదటి రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె గెలుపు కేవలం కేరళకే కాకుండా దేశం మొత్తానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్తులో మరింత గొప్ప విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తెస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.






