
భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో జరిగిన కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. Kirana Hills ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల లోపాలను బట్టబయలు చేసింది. పాకిస్తాన్ లోని సర్ధోడా సమీపంలో రాడార్లను లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లిన భారతీయ డ్రోన్ ఇంధనం తగ్గిపోవడంతో అనుకోకుండా ఈ వ్యూహాత్మక అణు కేంద్రంపై పడింది.
Operation Sindoor And Kirana Hills
ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ ప్రాంతంలో భారీగా నష్టం వాటిల్లినట్లు స్పష్టమైంది. భూగర్భ నిల్వ కేంద్రాలు మరియు రాడార్ వ్యవస్థల సమీపంలో దట్టమైన పొగలు అలుముకున్నట్లు శాటిలైట్ ఇమేజెస్‌లో రికార్డైంది. దీని ద్వారా పాక్ మిలిటరీ స్థావరాల భద్రత ఎంతటి బలహీనంగా ఉందో ప్రపంచానికి తెలిసొచ్చింది.
నిజానికి మిలిటరీ ప్లానర్స్ ఈ దాడుల సమయంలో స్కార్డు ప్రాంతాన్ని ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నారు. అయితే అక్కడ వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించకపోవడంతో ఆ వ్యూహాన్ని మార్చాల్సి వచ్చింది.
వాతావరణ మార్పుల కారణంగా కరాచీ సమీపంలోని భూలారి ప్రాంతంపై దాడులు జరిగాయని మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. ఈ సరికొత్త వ్యూహాత్మక పరిణామాలు రెండు దేశాల సైనిక బలగాల మధ్య చర్చనీయాంశంగా మారాయి.





