Kolikapudi Srinivasa Rao: మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాస్ రావు… ఏకంగా అధ్యక్షుడిపై హాట్ కామెంట్స్ ?

Kolikapudi Srinivasa Rao
Kolikapudi Srinivasa Rao

Kolikapudi Srinivasa Rao: తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదంలో ఇరుక్కుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి నుంచి ఇప్పటి వరకు నెలకు వివాదంలో ఆయన చిక్కుకుంటున్నారు. హాట్ కామెంట్స్ చేయడం, సొంత ప్రభుత్వం పై విమర్శలు చేయడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ చంద్రబాబు దృష్టిలో విలన్ గా మారిపోతున్నారు. Kolikapudi Srinivasa Rao

Kolikapudi Srinivasa Rao fires at TDP mandal president

చాలా సార్లు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చినా కూడా కొలికపూడి శ్రీనివాస రావులో ఎలాంటి మార్పు రాలేదు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తన దగ్గర ఎమ్మెల్యే కోసం ఐదు కోట్లు డిమాండ్ చేసినట్లు కూడా కొలికపూడి శ్రీనివాస రావు ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాస రావు ఇరుక్కున్నారు. Kolikapudi Srinivasa Rao

Also Read: Congress: బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా, సిగ్గుండాలి ?

టీడీపీ మండల అధ్యక్షుడిపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు ఫైర్ అయ్యారు. ఎస్సీ అధికారులపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎస్సీ అధికారులు మీకు ఏమి బానిసలు కాదని నిప్పులు చెరిగారు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి. వెలుగు ఆఫీసర్ పై టీడీపీ మండల అధ్యక్షుడు దాడి చేశారన్న విషయం తన దృష్టికి వచ్చింది అన్న కొలికపూడి శ్రీనివాస రావు, 48 గంటల్లో ఆ అధికారికి టీడీపీ అధ్యక్షుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అధికారులను బెదిరిస్తే ఎవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటూ హెచ్చ‌రించారు కొలికపూడి శ్రీనివాస రావు. Kolikapudi Srinivasa Rao

Also Read: Telangana BJP: బీజేపీలోకి వెళ్ళిన బీఆర్ఎస్ నేత‌ల‌ పరిస్థితి అధ్వాన్నం..డిజాపాట్లు గ‌ల్లంతు ?

Share your love