Kolikapudi Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు లీల‌లు…ఫోటో వైర‌ల్ ?

Kolikapudi Srinivasa Rao
Kolikapudi Srinivasa Rao

Kolikapudi Srinivasa Rao: తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మరో వివాదంలో ఇరుక్కున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏదో ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు కొలికపూడి శ్రీనివాస రావు. సొంత ప్రభుత్వం పైనే చాలా సార్లు విమర్శలు చేసి, టిడిపి అధిష్టానానికి టార్గెట్ అయ్యారు. పలుసార్లు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చినప్పటికీ, కొలికపూడి శ్రీనివాస రావు తన రూటు మార్చడం లేదు. Kolikapudi Srinivasa Rao

Kolikapudi Srinivasa Rao controversy photo viral

నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు కొలికపూడి శ్రీనివాస రావు. అయితే తాజాగా ఓ అమ్మాయితో అడ్డంగా దొరికిపోయారు. తన కార్యాలయానికి వచ్చిన ఓ లేడీ తో సాన్నిహిత్యంగా కొలికపూడి శ్రీనివాస రావు ఉన్న ఫోటో ఒకటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెను హగ్ చేసుకుని కొలికపూడి శ్రీనివాస రావు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు టిడిపి సోషల్ మీడియా అనే వైరల్ చేసి, వెంటనే టిడిపి నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని పోస్టులు పెట్టిస్తున్నారు. Kolikapudi Srinivasa Rao

Also Read: Konda Surekha: బస్వరాజు సారయ్య కుట్ర‌లు…కొండా దంప‌తుల‌ను వీడుతున్న నేత‌లు ?

అయితే ఇది రియ‌ల్ ఫోటోనా? లేక కావాలనే టిడిపి అతన్ని టార్గెట్ చేసి బయటకు పంపించేందుకు కుట్ర చేస్తుందా? సరికొత్త చర్చ మొదలైంది. ఈ ఫోటో పై ఇప్పటి వరకు కొలికపూడి శ్రీనివాస రావు స్పందించలేదు. అటు ఈ వివాదం చంద్రబాబు దాకా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైన వేటుపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కాగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీపై చాలా ఆరోపణలు చేశారు. విజయవాడ ఎంపీ కేసినేని శివ , టిడిపి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించేందుకు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. తిరువూరు టికెట్ కోసం కూడా ఐదు కోట్లు తీసుకున్నారని బాంబు పేల్చారు కొలికపూడి శ్రీనివాస రావు. Kolikapudi Srinivasa Rao

Also Read: Kavitha: నేను ముఖ్య‌మంత్రి అవుతా..కేటీఆర్ ను జైలుకు పంపిస్తా?

Share your love