Komatireddy Raj Gopal Reddy: నేపాల్ త‌ర‌హాలోనే తెలంగాణ ప్ర‌భుత్వం కూల్చే ప్ర‌మాదం ?

Komatireddy Raj Gopal Reddy: రేవంత్ సర్కార్‌ను హెచ్చరించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నేపాల్‌లో ప్రభుత్వాన్ని కూల్చేసినట్టే.. తెలంగాణలోనూ యువత తిరగబడే ప్రమాదముందని బాంబ్ పేల్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిరుద్యోగ యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ.. మనుగడ సాధించిన దాఖలాలు లేవు అని వెల్ల‌డించారు. Komatireddy Raj Gopal Reddy

Komatireddy Rajagopal Reddy warned Revanth Sarkar

నిరుద్యోగుల్ని గాలికి వదిలేయొద్దు.. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. ఎన్నిక‌ల కంటే ముందు ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని కోరారు. 2 ల‌క్ష‌లు ఉద్యోగాలు ఇవ్వ‌డం క‌ష్ట‌మే…కానీ ఎన్నో కొన్ని ఉద్యోగాలు ఇవ్వాల‌ని కోరారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మ‌నుగ‌డ ఉంటుంద‌ని ప‌రోక్షంగా హెచ్చ‌రించారు.

Also Read: Sleeping Pills: నిద్ర కోసం మాత్రలు వాడుతున్నారా…అయితే ప్రమాదమే ?

నేపాల్‌లో ప్రభుత్వాన్ని కూల్చేసినట్టే.. తెలంగాణలోనూ యువత తిరగబడే ప్రమాదముందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇవ్వ‌డంతో… ఆయ‌న‌పై కాంగ్రెస్ నేత‌లు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ లో ఉండి ఇలా మాట్లాడ‌టం ఏంట‌ని మండిప‌డుతున్నారు.

Also Read: Water Cane: ఒకే వాటర్ క్యాన్ చాలా రోజులు వాడుతున్నారు…అయితే జాగ్రత్త?