
Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అంటూ ఫైర్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అహంకారం తగ్గించుకోమని రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు గులాబీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మేము కష్టపడితే సీఎం అయ్యావు..నీ అదృష్టం అలా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. Komatireddy Rajagopal Reddy
Komatireddy Rajagopal Reddy on revanth reddy chandrababu
నీకు నువ్వే పదేళ్లు సీఎం అంటే రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని అవమానించడమే అంటూ నిప్పులు చెరిగారు. ఇది టీడీపీ కాంగ్రెస్సా ? రాహుల్ కాంగ్రెస్సా ? ఎవరి మద్దతుతో మళ్ళీ సీఎం అవుతావు ? అంటూ నిలదీశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. 140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో రేవంత్ లాంటి అహంకారంతో మాట్లాడే సీఎంని చూడలేదన్నారు. Komatireddy Rajagopal Reddy
Also Read: BRS: మున్సిపల్ ఎన్నికలు..బీఆర్ఎస్ ఓటు షేర్ డబుల్..ఎంతంటే ?
రేవంత్ ఇలా మాట్లాడుతుంటే మంత్రులు, అధిష్టానం ఎందుకు చప్పుడు చెయ్యట్లేదు ? అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటలు విన్నప్పుడల్లా వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత గుర్తొస్తుందని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికి చంద్రబాబు మనుషులు, ఆంధ్రా వాళ్ళ పెత్తనమే నడుస్తుందని వివరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారన్నారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్‌గా సీఎం అవుతానంటూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారట కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. Komatireddy Rajagopal Reddy
Also Read: BRS: కేసీఆర్ సీక్రెట్ ఏజెంట్ గా గూడెం మహిపాల్ రెడ్డి..బీఆర్ఎస్ చేతిలోకి 5 మున్సిపాలిటీలు…





