
Komatireddy Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీకి అవమానాలు జరుగుతున్నాయి. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుపరచడంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైందని జనాలే చెబుతున్నారు. కొన్ని పథకాలు అమలు చేసిన కూడా… గ్రౌండ్ స్థాయిలో అందరికీ అందలేదని కూడా వాదన వినిపిస్తున్నారు జనాలు. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల విషయం కూడా… రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. Komatireddy Rajagopal Reddy
Also Read: Abhishek Sharma: అఫ్రిది పరువు తీసిన అభిషేక్ శర్మ..రూ.33 లక్షల కారుతోనే
Komatireddy Rajagopal Reddy comments on kale yadaiah
ఎప్పుడు ఎన్నికలు వస్తాయో అనే టెన్షన్… గులాబీ పార్టీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని మరోసారి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కాలే యాదయ్యను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బంగారం లాంటి గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చావు అంటూ… ప్రశ్నించాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Also Read: Wine: దసరా వస్తోందని పీకదాకా తాగుతున్నారా… అయితే ఏ స్టఫ్ తీసుకోవాలి.. ఎంత తాగాలి..వివరాలు…
కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు పనులే కావు… అనవసరంగా వచ్చావని అతనితో అన్నారట. మంగళవారం మోయినాబాదులోని తన ఫామ్ హౌస్ కు వెళ్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి… చిలుకూరులో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య వెదురుపడ్డారట. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చావే..? టైమంతా వృధా అంటూ వ్యాఖ్యానించారట రాజగోపాల్ రెడ్డి. దీంతో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారా అని రేపుతున్నాయి. అటు గులాబీ పార్టీకి మంచి బలాన్ని ఇస్తున్నాయి.





