లెనిన్ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కింగ్ నాగార్జున చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన ఈ సినిమా జూలై 10న విడుదల కానుండగా, నాగార్జున తన హుకుం ద్వారా సినిమాపై భారీ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఈవెంట్లో మాట్లాడుతూ నేను కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ‘వస్తున్నాం కొడుతున్నాం’ అంటా. కానీ ఈసారి జూలై 10న వస్తున్నాం, మనోడు కొడుతున్నాడు అంటూ నాగార్జున స్టేజ్ మీద బ్లాక్బస్టర్ హుకుమ్ ప్రకటించారు. ఈ స్టేట్మెంట్ వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారి లెనిన్ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తిని సృష్టించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు అక్కినేని కుటుంబ సభ్యులు, చిత్ర బృందం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
గతంలో విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, లెనిన్ చిత్రం అఖిల్ కెరీర్లో కీలకమైనదిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇందులో అఖిల్ తన గత చిత్రాలకు భిన్నమైన మాస్ అవతార్లో కనిపించనున్నారని టాక్ ఉండడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా తెరకెక్కించిన విధానం ప్రమోషనల్ మెటీరియల్ ద్వారా స్పష్టమైంది.
మొత్తానికి నాగార్జున ఒక్క స్టేట్మెంట్తో లెనిన్ సినిమాపై ఉన్న బజ్ మరింత రెట్టింపు అయింది. చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేస్తూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పుతోంది. జూలై 10న రిలీజ్ కానుంది కాబట్టి ఇప్పటి నుంచే అభిమానుల్లో సినిమా కోసం వెయిటింగ్ పెరిగింది.





