ట్రాన్స్జెండర్ల సమస్యలపై తెరకెక్కిన ‘ఎల్జీబీటీ’ అనే ఈ కోర్టు రూం డ్రామా ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమా విజయం సాధించడంతో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రత్యేక మీట్ నిర్వహించి యూనిట్‌ని అభినందించింది. ఈ సందర్భంగా సినిమాలోని కీలక పాత్రలు, సబ్జెక్ట్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
LGBT Legal Battle Film Success Meet
నటుడు ఎల్.బి. శ్రీరామ్ ఈ సినిమాలో జడ్జి పాత్రలో నటించారు. ఆయన మాట్లాడుతూ – న్యాయదేవత కళ్లకు గంతలు కడతారు కానీ ఈ సినిమాలో తన కళ్లకు గంతలు కట్టడం ఒక ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పారు. ఈ సినిమా ద్వారా ట్రాన్స్జెండర్ల జీవితాలు, వారి ఆచారాలు తనకు బాగా అర్థమయ్యాయని అన్నారు. తెలంగాణ ట్రాన్స్ జెండర్ ప్రెసిడెంట్ లైలా ఓరుగంటి మాట్లాడుతూ – సొసైటీలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, న్యాయస్థానాల తీర్పులు, తమ ఆశలు అన్నీ ఈ సినిమాలో చాలా అందంగా చూపించారని తెలిపారు. అసలు ఇబ్బందుల్లో ఉన్న తమతోనే నటింపచేసి నిజమైన కథను చెప్పడం విశేషం అని అన్నారు.
నటుడు ఆనంద చక్రమాపాణి తొలి షూటింగ్ రోజున 20 మంది ట్రాన్స్జెండర్లతో కలిసి పనిచేయాలనుకున్నానని, కానీ కొంతమందితో ఫ్రెండ్లీగా మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన చాలామంది తనను చూసి ఎమోషన్ అయ్యారని, మీ ఫాదర్ మాలాగా ఉంటే బాగుండేది అంటూ ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు. నటుడు విష్ణు తేజ మాట్లాడుతూ – హీరోల గురించి తీసే సినిమాల్లో ఇలాంటి సబ్జెక్టులు చూస్తే క్రిటిక్స్గా ప్రశ్నించాలనిపిస్తుంది కానీ ఈరోజు ఫిలిం క్రిటిక్స్ మమ్మల్ని అభినందించడం గర్వంగా ఉంది అని తెలిపారు.
దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ – యూనివర్సిటీల నుంచి ఈ సినిమా ప్రైవేట్ స్క్రీనింగ్ గురించి చాలా రెస్పాన్స్ వస్తోంది, 2027లో ఈ సినిమాకి సెకండ్ పార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను అని అన్నారు. ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షులు బత్తుల ప్రసాదరావు ఈ సినిమా ఆత్మనూనత, ఆత్మగౌరవం మధ్య నలిగిపోతున్న జీవితాల కథ అని కామెంట్ చేశారు. క్రిటిక్స్ సెక్రటరీ సురేష్ కొండేటి ఈ టైటిల్ పాన్ ఇండియా లెవల్లో పనిచేస్తుందని, తప్పకుండా అవార్డులు రావాలి అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సోషల్ సబ్జెక్టు సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి ఒక మార్పుని తీసుకురావడం ఖాయం.





