Little Hearts: లిటిల్ హార్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్.. ఈటీవీ విన్ క్లారిటీ!!

Little Hearts: టాలీవుడ్‌లో తాజాగా విడుదలైన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘లిటిల్ హార్ట్స్ (Little Hearts)’ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. దర్శకుడు సాయి మార్తాండ్ (Sai Martand) వినూత్నంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మౌళి తనుజ్ (Mouli Tanuj), శివాని నగరం (Shivani Nagaram) హీరోహీరోయిన్లుగా నటించారు. సినిమా మొత్తం కామెడీ, లవ్ ట్రాక్, యూత్‌కు కనెక్ట్ అయ్యే entertainment quotient ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Little Hearts Telugu Movie OTT Update

ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో housefull collections తో దూసుకెళ్తోంది. ఇప్పటికే అనేక సెంటర్లలో సాలిడ్ రన్ కొనసాగుతున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. అయితే, సినిమా విజయంతో పాటు ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో, ETV Win అధికారికంగా స్పందించింది. ‘లిటిల్ హార్ట్స్’ ఓటీటీ రైట్స్ తమ వద్ద ఉన్నది నిజమే కానీ, ప్రస్తుతం ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది. థియేటర్లలో రన్ అవుతున్నంత వరకు ఓటీటీ రిలీజ్ ఉండదని, సరైన సమయంలో డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని వారు క్లారిటీ ఇచ్చారు.

ఆదిత్య హాసన్ (Aditya Haasan) ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయగా, రిలీజ్ బాధ్యతలు బన్నీ వాస్ (Bunny Vass), వంశీ నందిపాటి (Vamsi Nandipati) తీసుకున్నారు. మొత్తానికి, థియేటర్లలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తున్న ‘లిటిల్ హార్ట్స్’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మరింతగా పెరుగుతోంది.

Share your love