మహేశ్ కాంపెల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ టీజర్ లాంచ్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ view point సినిమా సత్య చౌదరి నిర్మాణంలో తెరకెక్కుతోంది. సోనియా నాయుడు, పూజారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఈవెంట్లో సినిమా టీజర్ను విడుదల చేశారు.
నిర్మాత సత్య చౌదరి మాట్లాడుతూ, ఈ view point సినిమా కేవలం థ్రిల్లర్ మాత్రమే కాకుండా బలమైన సందేశం కూడా ఇస్తుందని తెలిపారు. ఇది మహిళా ప్రధాన చిత్రం కావడంతో, ఇద్దరు హీరోయిన్లను పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో నటించడం తమకు గర్వంగా ఉందని సోనియా నాయుడు, పూజారెడ్డి తెలిపారు.
దర్శకుడు మహేశ్ కాంపెల్లి మాట్లాడుతూ, దిశ ఘటనతో పాటు కొన్ని వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది ఈ కథ రాసుకున్నానని వెల్లడించారు. ఈ view point సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమన్నారు. ఇంకా అన్విధ్, సాగర్, సమీర్, రంగారావు చౌదరి, ముసా అలీఖాన్ కూడా ఈ ఈవెంట్లో మాట్లాడారు.
మహేశ్ కాంపెల్లి తన తొలి ప్రయత్నంలోనే ఇంత బలమైన సబ్జెక్ట్తో రావడం విశేషం. ఈ view point సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. థ్రిల్లర్ జానర్లో కొత్త ట్విస్టులతో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం షూటింగ్ ఫేజ్లో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.





