VangaVeeti Mohanranga: కాపు నాయకుడి కూతురు జనసేనలో చేరిక

జనసేనలోకి వంగవీటి కుమార్తె..!

కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత జనసేన పార్టీలో చేరిక ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమె త్వరలోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.

ఇప్పటికే ఆశాలత జనసేనకు చెందిన ఓ కీలక ఎమ్మెల్సీతో రెండుసార్లు భేటీ అయ్యారు. తన రాజకీయ చేరికపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై జనసేన పార్టీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

గత ఏడాది మీడియా ముందుకు వచ్చిన ఆశాలత ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. ముఖ్యంగా రంగా ఆశయాలను నిలబెట్టడం, పేదలు, అణగారిన వర్గాలకు న్యాయం చేయడం తన లక్ష్యమని తెలిపారు. ఇప్పుడు జనసేనలో చేరే ప్రయత్నాలు ముమ్మరం చేయడం గమనార్హం.

రంగా కుమారుడు రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నప్పటికీ అక్కడ సక్రియంగా లేరు. ఈ నేపథ్యంలో ఆశాలత జనసేన వైపు చూడటం రాజకీయాల్లో ఊహించని పరిణామం. ఇది రాబోయే ఎన్నికల్లో కాపు వర్గం ఓట్లపై ప్రభావం చూపనుంది. మరి ఈ చర్చలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu