Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం ?

Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం అంటూ బాంబు పేల్చారట‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే మొత్తం సర్వనాశనం చేసిండని…తనను కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో బాధను పంచుకున్నారట‌ ఖర్గే. సీనియర్ జర్నలిస్ట్, సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు సంచలన విషయాలు బయటపెట్టారు. రేవంత్ రెడ్డి గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలం అయ్యాడని ఆగ్ర‌హించార‌ట‌. Mallikarjun Kharge

Mallikarjun Kharge It is unlikely that Congress will come to power again in Telangana

పరిపాలన గాడి తప్పిందని ప్రజలు అనుకుంటున్నారని, మంత్రుల మధ్య కీచులాటలు, వాటాల పంపకాల లొల్లి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చిందని వివ‌రించార‌ని పేర్కొన్నార‌ట‌. బిసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల మన పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడి అయ్యిందని బాంబ్ పేల్చార‌ట జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. మొదటి నుండి పార్టీలో అందరినీ కలుపుకొని పోలేదు. ఇతర పార్టీలతో కూడా సరిగ్గా సమన్వయం చేసుకోలేదని వివ‌రించార‌ట‌. ఇప్పుడు బిసి రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది అనే సంకేతాలు వెళ్తున్నాయి. అది పార్టీకి తీవ్ర నష్టం చేసిందని వెల్ల‌డించార‌ట‌. Mallikarjun Kharge

Also Read: Sugar: తియ్య‌గా ఉంద‌ని, చక్కెర ఎక్కువగా తింటున్నారా..అయితే 100 రోగాలు ఎటాక్ ?

మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉన్న రెడ్లు, దళితులు ఈ అంశం వల్ల మనకు దూరం అయ్యారని తెలిపార‌ట‌. పోనీ బిసిలు అయినా మనకు దగ్గర అయ్యారా అంటే అదీ లేదని స్ప‌ష్టం చేశార‌ట‌. రేవంత్ చేసిన నిర్వాకం వల్ల అన్ని కులాల వాళ్లూ కాంగ్రెస్ మీద ఆగ్రహంగానే ఉన్నారని అన్నార‌ట‌. అనవసరంగా రేవంత్ ఇందులోకి రాహుల్ గాంధీ పేరును లాగాడు. ఇది రాహుల్ ఇమేజ్‌ను కూడా డ్యామేజ్ చేసిందని బాంబ్ పేల్చారు మల్లికార్జున ఖర్గే. Mallikarjun Kharge

Also Read: Smriti Mandhana: టీమిండియా లేడీ కోహ్లీని ఏడిపించిన ఇంగ్లండ్‌

Share your love