మారుతీ సుజుకి గ్రాండ్ విటారా విషయంలో E20 ఇష్యూ గురించి కోర్టు ఓ కీలక ఆదేశం జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల కమీషన్, E20 పెట్రోల్ వాడకం వల్ల తన కారు ఇంజిన్ తరచూ stall అవుతుందని ఫిర్యాదు చేసిన డాక్టర్ ప్రేమ్‌రాజ్ దేబ్తాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇంధన ట్యాంక్ క్లీనింగ్ కోసం పలు సర్వీస్ సెంటర్లకు వెళ్లినా ప్రాబ్లెమ్ తగ్గలేదు.
E20 కారు రీప్లేస్మెంట్ ఆర్డర్
ఈ వాహనం E20 ఫ్యూయల్‌కు సూట్ కాదని, అది service లోపం మరియు అన్యాయమైన ట్రేడ్ ప్రాక్టీస్ అని కమీషన్ తేల్చింది. కంపెనీ 45 రోజుల్లో కస్టమర్‌కు కొత్త E20-కంప్లైంట్ గ్రాండ్ విటారా ఇవ్వాలి. ఆ సమయంలో ఫెయిల్ అయితే, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కలిపి రూ. 20.50 లక్షలు రీఫండ్ చేయాలి. మెంటల్ హరాస్‌మెంట్ కోసం రూ. 1 లక్ష కంపెన్సేషన్, కోర్టు ఖర్చుల కోసం రూ. 10,000 కూడా చెల్లించాలి. పాటించకపోతే ఈ మొత్తాలపై అదనపు ఇంట్రెస్ట్ పడుతుంది.
దేశవ్యాప్తంగా E20 ఫ్యూయల్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కారు యజమానులు ఇంజిన్ పెర్ఫార్మెన్స్, మైలేజ్ ప్రాబ్లెమ్స్ గురించి చెప్పుకుంటున్నారు. మారుతీ సుజుకి తన E20-కంప్లైంట్ మోడల్స్ ఎథనాల్ మిక్స్చర్ కోసం డిజైన్ చేయబడ్డాయని క్లెయిమ్ చేస్తోంది. కానీ ఈ కేసులో కంపెనీ, డీలర్ రిపీటెడ్ కంప్లెయింట్స్ తర్వాత కూడా సరైన రీప్లేస్‌మెంట్ ఇవ్వలేదని కమీషన్ నిర్ధారించింది.
ఈ తీర్పు ఆటోమేకర్లకు ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లు ఉంది – విక్రయించే వాహనాలు కొత్త ఫ్యూయల్ స్టాండర్డ్‌కు ఫుల్లీ కంప్లైంట్ అయి ఉండాలి. వినియోగదారుల రైట్స్‌ను కాపాడటం మరియు వారి నమ్మకాన్ని కాపాడుకోవడం ఇప్పుడు అందరికీ ప్రయారిటీ అయ్యింది.





