SHIVAJI : పాలిటిక్స్ పై న‌టుడు శివాజీ సెన్షేష‌న్ కామెంట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Shivaji
Shivaji

SHIVAJI : తెలుగు సినీ న‌టుడు శివాజీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇటీవ‌లే అత‌ను న‌టించిన దండోరా సినిమాకు అవార్డు కూడా ల‌భించింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌కీయాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో అవి వైర‌ల్ గా మారాయి. గ‌తంలో రాజ‌కీయాలపై స్పందించిన శివాజీ ప్ర‌స్తుతం రాజకీయాల‌కు దూరంగా ఉంటున్నారు. సినిమాల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. SHIVAJI

ACTOR SHIVAJI SENSATIONAL COMMENTS ON POLITICS..VIRAL ON SOCIAL MEDIA

రాజ‌కీయాల‌ను మాత్రం పూర్తిగా ప‌క్క‌న పెట్టలేద‌ని.. అవ‌స‌రం అయితే త‌ప్ప‌కుండా స్పందిస్తాన‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాను. కానీ దేశంలో లేదా రాష్ట్రంలో జ‌రుగుతున్న విష‌యాల‌ను గ‌మ‌నించ‌కుండా ఉండ‌టం లేదు. ఎక్క‌డైనా శృతి మించితే త‌ప్ప‌కుండా మాట్లాడుతాన‌ని స్ప‌ష్టం చేసారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం పై ఆయ‌న తన అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. కొత్త ప్ర‌భుత్వం అధికారంలోకి ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే అయింద‌ని.. పాల‌న‌ను పూర్తిగా అంచ‌న వేయ‌డానికి ఇంకొంత స‌మ‌యం అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. కొత్త ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అన్ని మారిపోతాయ‌నుకోవ‌డం స‌రైంది కాద‌న్నారు.

Also Read : MINISTER KONDA SUREKHA : కాంగ్రెస్ ఎమ్మెల్యే పై మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నూత‌న ప్ర‌భుత్వం మంచి చేస్తుంద‌నే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తోంది అన్నారు. ముఖ్యంగా ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖ నాయ‌కుల‌పై జ‌రిగిన విమ‌ర్శ‌ల‌ను గుర్తు చేసారు. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారిని ఎంత విమ‌ర్శించారో అంద‌రికీ తెలిసిందే. ఎన్నో తిట్లు తిన్నారు. కానీ చివ‌రికీ ఏమైంది..? ప్ర‌జ‌లు ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని.. ప్ర‌జాస్వామ్య శ‌క్తి అన్నారు. నారా లోకేష్ గురించి కూడా శివాజీ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. గ‌తంలో లోకేష్ ను చూసి ప‌ప్పు ప‌ప్పు అని ఎగ‌తాళి చేశారు. కానీ ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం ప‌ప్పు కాదు.. నిప్పు అని చెబుతోంది. ఎగ‌తాళి చేసిన వారే ఆయ‌న‌లో ఉన్న నాయ‌క‌త్వాన్ని బ‌య‌టికి తీసుకొచ్చార‌ని తెలిపారు. రాజ‌కీయం అంటే ప్ర‌జ‌లు మ‌న వెన‌కాల నిల‌బ‌డాలి కానీ.. నాయ‌కులు ప్ర‌జ‌ల్లో భ‌యం క‌లిగించ‌కూడ‌ద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు శివాజీ.

Also Read : CM REVANTH REDDY : తెలంగాణ‌లో రైతుబంధు ర‌ద్దు.. అదొక చెత్త ప‌థ‌కం..!