
Konda Surekha: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మేడారం జాతర హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 31వ తేదీ వరకు ఈ మేడారం జాతర సాగనుంది. ఇలాంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుకు వెళ్తోంది. అయితే ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. Konda Surekha
Minister Konda Surekha stays away from Medaram fair
తెలంగాణ మంత్రులందరూ మేడారంలో ఉంటే.. కొండా సురేఖ మాత్రం దూరంగా ఉన్నారు. ఆమె హడావిడి ఎక్కడ కనిపించడం లేదు. దీంతో తెలంగాణ మంత్రుల మధ్య గ్యాప్ ఉందని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. జాతర తొలి రోజు సారలమ్మ, పగిడిద్దరాజు అలాగే గోవిందరాజులు గద్దెలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారికంగా మంత్రి సీతక్క స్వాగతం పలకడం జరిగింది. Konda Surekha
Also Read: Deputy CM Ajit Pawar : అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సంచలన వీడియో
అటు మంత్రి పొంగులటి శ్రీనివాస్ రెడ్డి కూడా మేడారం వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంత జరుగుతున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాత్రం రాకపోవడం ఇప్పుడు చర్చ నియాంశమైంది. మంత్రుల మధ్య విభేదాలు ఉండడం కారణంగానే ఇది జరుగుతోందని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. Konda Surekha
Also Read: Ajit Pawar-plane crash: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి




















