Ajit Pawar-plane crash: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

Ajit Pawar-plane crash: మహారాష్ట్రలో పెను విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బారామతికి ప‌యనం అయ్యారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఈ త‌రుణంలోనే బారామ‌తిలో ల్యాండ్ అవుతుండగా విమానం కుప్ప‌కూలింది. Ajit Pawar-plane crash

Ajit Pawar dies in plane crash

ఉదయం 8.45 గంటలకు విమాన ప్రమాదం జ‌రుగ‌గా, స్పాట్ లోనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదంలో విమానంలో ఉన్న ఆరుగురు మృతి చెందినట్లు నిర్ధారించిన డీజీసీఏ.. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. Ajit Pawar-plane crash

Also Read: Kodandaram: కాంగ్రెస్ స‌ర్కార్ పై కోదండరాం తిరుగుబాటు..మార్పు మొద‌లైందంటూ ?

ఈ సంఘ‌ట‌న చోటు చేసుకున్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ సంఘ‌ట‌న ఎలా జ‌రిగింది? ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆరా తీస్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది. Ajit Pawar-plane crash

Also Read: Singer Chinmai: కాస్టింగ్ కౌచ్ వివాదం..సెక్స్ కోరుకుంటారని చిన్మ‌యి ఫైర్ ?

https://twitter.com/TeluguScribe/status/2016364292329914428?s=20
Share your love