
Pawan Kalyan: సినీ ఫీల్డ్ లో ఎప్పుడూ హిట్లు పడతాయో ఎప్పుడు ప్లాపులు పడతాయో చెప్పడం కష్టం.. ఒక్కోసారి అన్ని హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ సడన్ గా ప్లాప్ లను చవి చూస్తూ ఉంటారు.. అన్ని ఫ్లాపులు చూసిన డైరెక్టర్స్ సడన్ గా హిట్ కొట్టి ఆశ్చర్యపరుస్తారు. ఇది డైరెక్టర్స్ విషయంలో కాకుండా హీరో, హీరోయిన్ల విషయంలో కూడా ఉంటుంది. కొంతమంది హీరో హీరోయిన్స్ కెరియర్ ఓవర్ నైట్ లోనే మారిపోతుంది.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి స్టార్ హీరోయిన్ గా మారిన వారు ఉన్నారు.
Pawan Kalyan has become lucky for heroines
అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శృతిహాసన్.. ఈమె కెరియర్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు ముందు ఒక విధంగా ఉండేది, ఈ సినిమా తర్వాత మరో తీరు అయిపోయింది. అయితే గబ్బర్ సింగ్ చిత్రానికి ముందు శృతిహాసన్ అన్ని ఫ్లాప్లే చూసింది. ముఖ్యంగా ఈమెను ఐరన్ లెగ్ అన్నారు. అలాంటి ఈమె పవన్ తో గబ్బర్ సింగ్ చిత్రం చేసిన తర్వాత అద్భుతమైన పేరు సంపాదించి స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి వెళ్లిపోయింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు.(Pawan Kalyan)
Also Read: OG Movie: స్క్రీన్ స్పేస్ తక్కువ ఉందని OG మూవీలో హీరోయిన్ రోల్ వదులుకున్న నటి.?
ప్రస్తుతం అలాంటి ఛాన్సే ఓజీ సినిమా ద్వారా ప్రియాంక అరుల్ మోహన్ కు వచ్చిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఓవైపు గబ్బర్ సింగ్ సీన్ మరోవైపు ఓజీ చిత్రం సీన్ జత చేసి నెటిజన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ప్రియాంక మోహన్ ఓజి సినిమాకి ముందు చాలా చిత్రాల్లో చేసింది. కానీ ఆమెకు ఏ చిత్రం కూడా అంతగా హిట్ ఇవ్వలేదు.. ప్రస్తుతం ఆమె ఓజీ చిత్రంలో నటించడంతో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది.

అయితే ఈ సినిమా హిట్ అయినా కాకపోయినా పవన్ కు పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ ఈ హీరోయిన్ కెరియర్ మాత్రం ఈ సినిమా పైన ఆధారపడింది. కానీ ఈ చిత్రం అద్భుతమైన హిట్ సాధించే దిశగా వెళుతుండడంతో ప్రియాంక మోహన్ అదృష్టవంతురాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పవన్ అప్పుడు శృతిహాసన్ కు లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రియాంక మోహన్ కు లైఫ్ ఇవ్వబోతున్నారంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తూ కామెంట్లు పెడుతున్నారు.(Pawan Kalyan)





