Telangana: ముకుల్ రాయ్ ఎఫెక్ట్..తెలంగాణలో 10 ఉప ఎన్నిక‌లు ప‌క్కా ?

Telangana
Telangana

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. తాజాగా పార్టీ ఫిరాయించిన బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేడివేసింది కలకత్తా హైకోర్టు. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే బిజెపి పార్టీకి రాజీనామా చేసి, తృణ‌మూల్‌ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌. అయితే ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ ఫిరాయించిన బిజెపి ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌ పై అనార్హత వేటు వేసింది కలకత్తా హైకోర్టు. Telangana

Mukul Roy effect10 by-elections in Telangana

అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పినా కూడా, పార్టీ ఫిరాయింపు చర్యల కింద శిక్షకు అర్హులే అంటూ కలకత్తా హైకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అనర్హత ముకుల్ రాయ్ పై వేటు వేసింది కోర్టు. అయితే తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి పార్టీలో చేరినట్లు తెలిపారు. ఆ తర్వాత అది దేవుడి కండువా అన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పోస్టులు పెట్టుకున్నారు. ఆ తర్వాత డిలీట్ చేశారు. ఇలా అన్ని రుజువులు కోర్టు ముందు గులాబీ పార్టీ పెట్టింది. Telangana

Also Read: Arjun Tendulkar: ప్ర‌మాదంలో స‌చిన్ కొడుకు కెరీర్..న‌ట్టేట ముంచేసిన అంబానీ ?

కలకత్తా హై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, తెలంగాణ హై కోర్టు కూడా తీర్పు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. త్వరలోనే తెలంగాణలో జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ కూడా రానుంది. ఆ సందర్భంగా కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పునే తెలంగాణ హైకోర్టు అమలు చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణలో 10 నియోజక వర్గాల్లో ఉప ఎన్నిక రానుంది. దీంతో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. Telangana

Also Read: Vemulawada: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత..రేవంత్ రెడ్డి కుర్చీకి ప్రమాదమేనా?

Share your love