Vemulawada: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత..రేవంత్ రెడ్డి కుర్చీకి ప్రమాదమేనా?

Vemulawada: తెలంగాణ రాష్ట్రంలో పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణ కాశీగా వేములవాడ రాజన్న ఆలయాన్ని పిలుస్తూ ఉంటారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత రాజన్న ఆలయాన్ని చాలానే కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తోంది. యాదాద్రి తరహాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి దూసుకు వెళ్తున్నారు. Vemulawada

vemulawada temple history cm revanth reddy post

ఇందులో భాగంగానే తాజాగా దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేశారు. మరమ్మత్తుల పేరుతో భీమన్న ఆలయంలో దర్శనాలు జరుగుతున్నాయి. మొత్తం 693.25 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మంగళవారం నుంచి ఆలయం ప్రధాన గేటు కూడా ఇనుప రేకులతో మూసివేశారు. ప్రధాన ఆలయంలో స్వామివారికి అర్చకులు మాత్రమే పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. భక్తుల దర్శనాలు, కోడె ముగ్గులు లాంటివి అన్నీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నాయి. ఇలా జరగడం చరిత్రలోనే తొలిసారి. అయితే ఇలా వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేస్తే సీఎం రేవంత్ రెడ్డి కుర్చీకి ప్రమాదం అని కొంతమంది సెంటిమెంటును నమ్ముతున్నారు.Vemulawada

Also Read: RCB: చిన్న‌స్వామిలో నో ఐపీఎల్..షాక్ లో బెంగ‌ళూరు ఫ్యాన్స్?

గతంలో సీఎం రేవంత్ రెడ్డి అందుకే వేములవాడ పర్యటనకు ఎక్కువగా రాలేదని చెబుతున్నారు. వేములవాడ రాజన్న ను సీఎం స్థాయిలో కేసీఆర్ ఎప్పుడు దర్శించుకోలేదు. దర్శించుకున్న ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే. సీఎం స్థాయిలో వేములవాడ రాజన్నను దర్శించుకుంటే పదవి పోతుందనే సెంటిమెంటు ఎప్పటి నుంచే ఉంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా ఆలయాన్ని మూసివేశారు. దీంతో ఆయన పదవి పోయే ప్రమాదం పొంచి ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, దీన్ని కాంగ్రెస్ నేత‌లు కొట్టిపారేస్తున్నారు. Vemulawada

Also Read: KCR: జూబ్లీహిల్స్ లో ఓడిపోతే, KCR ఫ్యామిలీ మొత్తం అరెస్ట్?