విలన్ లేని ఫీల్ గుడ్ మూవీ.. ఆగస్ట్ 14 న నయనతార ‘హాయ్’!!

Scene from Telugu film

హీరోయిన్ నయనతార మరియు యంగ్ హీరో కెవిన్ కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా ‘హాయ్’ విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలోకి రానుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి మేకర్స్ ఇప్పటికే పోస్టర్ విడుదల చేసి సందడి చేశారు.

దర్శకుడు విష్ణు ఎడ్విన్ హాయ్ సినిమా స్పెషల్ గురించి చెప్పిన విషయాలు ఇవిగో…

దర్శకుడు విష్ణు ఎడ్విన్ ఈ సినిమా పూర్తిగా ఫీల్ గుడ్ మూవీ అని చెప్పారు. ఇందులో ఎలాంటి విలన్ లేదు. హాస్యం, కుటుంబ బంధాలు, భావోద్వేగాలు ఇవన్నీ కలగలిసిన సినిమా ఇది. కథ చెన్నై, కోయంబత్తూర్, పొల్లాచ్చి ప్రాంతాల్లో నడుస్తుంది. నయనతార పాత్ర కంప్లీట్లీ న్యూ రీతిలో ఉంటుందని దర్శకుడు స్పష్టం చేశారు.

ఈ సినిమాకు నయనతార నిర్మాతగా కూడా వ్యవహరించారు. జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్ మరియు సెవెన్స్క్రీన్ స్టూడియో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. నిర్మాతలుగా విఘ్నేష్ శివన్ మరియు ఎస్.ఎస్.లలిత్ కుమార్ ఉన్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 14న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu