“ఫౌజీ” రిలీజ్ పై వైరల్ గా మారిన అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కు రావొచ్చనే విషయంపై నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఫౌజీ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ ఒక అభిప్రాయానికి వచ్చారట. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది.

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ప్రోగ్రెస్ చూసి రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఫౌజీ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇమాన్వీ హీరోయిన్ గా పరిచయమవుతోంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంతో సాగే లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఫౌజీ ఉండబోతోంది. ఈ సినిమా మీద మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

Share your love