OG Movie Review: అలాంటోడు మళ్ళీ వచ్చాడంటే.. ‘ఓజీ’ మూవీ రివ్యూ!!

OG Movie Review and Rating

OG Review: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విడుదలైన ఆయన చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఆశించిన విజయం సాధించలేదు. దీంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ‘ఓజీ’పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. చాలా అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఉందో లేదో ఈ సమీక్షలో తెలుసుకుందాం. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించారు. మొదట నుంచి ‘హరిహర వీరమల్లు’ కంటే ‘ఓజీ’ మీదనే అంచనాలు ఉండటంతో ఈ సినిమాపైనే అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా విజయం పవన్ రాజకీయ జీవితానికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. చాలా అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఉందో లేదో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ: జపాన్‌లోని సమురాయ్ వంశం నుండి వచ్చిన ఓజస్ గంభీరా (పవన్ కళ్యాణ్), సత్య దాదా (ప్రకాష్ రాజ్)తో కలిసి ముంబైకి వస్తాడు. సత్యకు అండగా నిలిచే గంభీరా, అనుకోని కారణాల వల్ల ముంబైని వదిలి వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో సత్య పోర్ట్ ను స్నేహితుడు మిరాజ్ కర్, అతని కొడుకులైన జిమ్మీ, ఓమీ వల్ల సత్య కుటుంబానికి ప్రమాదం ఏర్పడుతుంది. జిమ్మీ, సత్య రెండో కొడుకుని చంపేస్తాడు, ఓమీ మిగతావారిని హతమారుస్తుంటాడు. ఈ సమయంలో గంభీరా తిరిగి ముంబైకి వచ్చి, తన పాత శత్రువులతో పోరాడతాడు. కన్మణి (ప్రియాంక మోహన్), అర్జున్ దాస్, శ్రియా రెడ్డి పాత్రలు కథలో కీలక మలుపులు తెస్తాయి. అవేంటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటులు: ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా నటించారు. ఆయన రీ ఎంట్రీ తర్వాత ఇంత స్టైలిష్‌గా, పవర్ ఫుల్‌గా కనిపించడం ఇదే మొదటిసారి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, హీరోయిజం సీన్స్ అభిమానులకు పండుగలా అనిపిస్తాయి. విలన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ పర్వాలేదనిపించాడు. మొదట పవర్‌ఫుల్‌గా అనిపించినా, తర్వాత హీరో ముందు నిలబడలేకపోయాడు. కథానాయిక ప్రియాంక మోహన్ తన చిన్న పాత్రలో ఓకే అనిపించింది. మిగిలిన నటీనటులలో శ్రేయా రెడ్డి మాత్రం తన నటనతో ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ తన నటన, స్టైలిష్ లుక్ తో సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచారు.

సాంకేతిక నిపుణులు: ఈ చిత్రంలో నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. చిత్ర నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారని ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా తెలుస్తుంది. సినిమాటోగ్రాఫర్లు రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంసలు అందించిన విజువల్స్ పీక్ లెవెల్‌లో ఉన్నాయి. ఇక, తమన్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా సెకండాఫ్‌లో తన మ్యాజిక్ బాగా పనిచేసింది. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా కథనాన్ని ఆసక్తికరంగా మార్చింది. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చేలా ఫ్యాన్ బాయ్ మూమెంట్స్‌ని బాగా డిజైన్ చేశాడు. అయితే, కథనం విషయంలో మాత్రం మరింత గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది. పవన్ పాత్ర వరకు బాగానే ఉన్నప్పటికీ, మిగతా కథనం నెమ్మదిగా సాగుతూ, కొన్ని చోట్ల బలహీనంగా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

పవన్ కళ్యాణ్ స్టైల్ & స్క్రీన్ ప్రెజెన్స్

దర్శకుడి ఫ్యాన్ బాయ్ మూమెంట్స్

అద్భుతమైన నిర్మాణ విలువలు

తమన్ సంగీతం

హై-క్వాలిటీ సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

బలహీనమైన కథనం

పవర్ లేని విలన్ పాత్ర

కథలో అస్పష్టత

నెమ్మదిగా సాగే మొదటి సగం

తీర్పు: ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పండుగ. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను, స్టైల్‌ను అద్భుతంగా తెరపై చూపించారు. సినిమాకు సంబంధించిన నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ, మరియు తమన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే, కథనం చాలా బలహీనంగా, నెమ్మదిగా సాగడం, విలన్ పాత్రకు సరైన ప్రాధాన్యత లేకపోవడం వంటివి మైనస్ పాయింట్లు. మొత్తం మీద, పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకునే ఫ్యాన్ బాయ్ ఫీస్ట్ ఇది. మిగతా ప్రేక్షకులకు మాత్రం కథనం నిరాశ పరుస్తుంది.

Rating: 2.5/5

Tag Line: స్టైలిష్ అండ్ వైలెంట్ ఫ్యాన్ ఫీస్ట్.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu