Peddi: ఓటీటీలో ‘పెద్ది’ కి షాక్.. వ్యూస్ తగ్గడానికి కారణం ఇదే!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా థియేటర్లలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది, కానీ మొదటి వారంలోనే అనుకోని షాక్ ఎదురైంది.

Peddi OTT Shock at Netflix

జూలై 9న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లో (జూలై 6-12 వీక్లీ డేటా) కేవలం 1.9 మిలియన్ వ్యూస్ మాత్రమే నమోదు చేసింది. దీనికి reason గా నెట్ఫ్లిక్స్ రిలీజ్ స్ట్రాటజీని చెబుతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వచ్చినా హిందీ వెర్షన్ ను మాత్రం స్ట్రీమింగ్ కు తీసుకురాలేదు. ఇండియాలో అతిపెద్ద OTT మార్కెట్ అయిన హిందీ ప్రేక్షకులు సినిమాను చేరుకోలేకపోయారు. దీని వల్ల కోట్లమంది వ్యూయర్స్ ను సినిమా కోల్పోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పెద్ది కంటే చిన్న బడ్జెట్ సినిమాలు నెట్ఫ్లిక్స్ లో బెటర్ రెస్పాన్స్ పొందడం గమనార్హం. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా నటించిన ‘ఇక్కా’ జులై 10న విడుదలై మూడు రోజుల్లోనే 4.4 మిలియన్ వ్యూస్ సాధించింది. అది గ్లోబల్ టాప్-10లో రెండో స్థానంలో నిలిచింది. అలాగే ‘బ్లాస్ట్’ చిత్రం కూడా ఇప్పటికీ టాప్-10లో కొనసాగుతోంది. ఇది పెద్ది కంటే మెరుగైన ఓపెనింగ్ పొందింది.

ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో హిట్ అయిన సినిమాలు OTT లో కూడా అదే స్థాయి విజయాన్ని సాధించడం మారిపోయింది. OTT success ఇప్పుడు కంటెంట్, రిలీజ్ స్ట్రాటజీ, భాషల పంపిణీ వంటి అనేక ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతోంది. పెద్ది విషయంలో, హిందీ వెర్షన్ లేకపోవడం ప్రధాన నిరాశగా మిగిలింది.

Share your love