AP Elections Survey that party will win

AP Elections Survey: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే లోక్సభ ఎన్నికల పోలింగ్ మరో వారం రోజులు లోపే జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంపై దూకుడు పెంచాయి. అంతేకాదు ఈ ఎన్నికల నేపథ్యంలోనే తాజాగా రెండు సర్వే రిపోర్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సర్వే రిపోర్ట్ లు ఏం చెబుతున్నాయి…? ఏ పార్టీకి అనుకూలంగా గ్రౌండ్ రిపోర్టు ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. AP Elections Survey

AP Elections Survey that party will win

ఏపీ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్ట్రోరల్ మరియు పాలిమెట్రిక్స్ అనే సర్వే రిపోర్ట్ లు బయటకు వచ్చాయి. ఈ రెండు సర్వే రిపోర్ట్ లో ప్రకారం ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అని తేలిపోయింది. ఒకసారి ఆ సర్వే రిపోర్ట్ లు పరిశీలిస్తే… ఎలక్ట్రోరల్ సర్వేలో వైసిపి పార్టీ అధికారం మరోసారి దక్కించుకుంటుందని తేలిపోయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఏకంగా 110 నుంచి 120 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది ఈ సర్వే సంస్థ. AP Elections Survey

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కట్టప్ప గా మారిన వర్మ… జనసేనకు ఓటు వేయొద్దంటూ ప్రచారం ?

అలాగే ప్రతిపక్ష కూటమి అయిన తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీలకు 55 నుంచి 60 స్థానాలు వస్తాయని స్పష్టమైనది. అంటే దాదాపు 50 శాతం వైసీపీకి వోట్ షేరింగ్ ఉంటుందట. అలాగే టిడిపి కూటమికి 43.5% ఓట్ పెర్సెంట్ ఉంటుందట. కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం మాత్రమే ఓట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. పాలిమెడ్రిక్స్ సర్వే రిపోర్టులో కూడా అధికార వైసిపి పార్టీ మరోసారి అధికారాన్ని చేజికించుకోబోతుందని తేలిపోయింది. ఈ సర్వే రిపోర్టులో కూడా వైసిపి పార్టీకి 115 సీట్లకు పైగా వస్తాయని తేలిపోయింది. AP Elections Survey

అటు తెలుగుదేశం కూటమికి 39 స్థానాలు మాత్రమే వస్తాయని… మరో 23 స్థానాలలో టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే సంస్థ స్పష్టం చేసింది. ఈ రెండు సర్వేల ప్రకారం చూసుకున్నట్లయితే ఏపీలో వైసీపీ పార్టీ మరోసారి ఎంపీ సీట్లను కూడా ఎక్కువగా గెలుచుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి. మరి ఏపీ ఓటర్లు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు చూడాలి. AP Elections Survey

Join WhatsApp