Revanth Reddy Real Story Behind Seat Allotment Controversy

Revanth Reddy Real Story Behind Seat Allotment Controversy

Revanth Reddy తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసింది. అయితే ఈయన ను పీసీసీ చీఫ్ గా నియమించినప్పటినుండి కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలు కాంగ్రెస్ అధిష్టానం పై, ఆయన పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అంతేకాదు ఆయన చేసే పనులకు ఆటంకాలు కలిగిస్తూ వస్తున్నారు.అయితే ఇప్పటికే గెలుపు గుర్రాలు అని చెప్పుకునే దాదాపు 50 మంది పేర్లను ఫస్ట్ లిస్టులో బయటపెట్టారు.

అయితే ఎప్పటినుండో తమకు సీటు వస్తుంది అని చూస్తున్న ఆశావాహులకు రేవంత్ రెడ్డి మొండి చేయి చూపించినట్టు తెలుస్తుంది.అయితే పార్టీలో గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి నోట్ల కట్టలకు సీట్లు అమ్ముకుంటున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఇది విపక్షాలు మాత్రమే కాకుండా సొంత పార్టీ నాయకులు రేవంత్ పై ఆరోపించడంతో ప్రతి ఒక్కరు ఇది నిజమే అని నమ్ముతున్నారు. ఇప్పటికే రేవంత్ కి అత్యంత సన్నిహితుడైన సోమశేఖర్ రెడ్డి రేవంత్ గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. Revanth Reddy

Also Read : BRS Manifesto : వేలంపాట పాడినట్లు బిఆర్ఎస్ మేనిఫెస్టో.. హ్యాట్రిక్ కొట్టడం కష్టమేనా..?

ఇన్నాళ్లు రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడాను ఇప్పుడు ఆయన గురించి అన్ని విషయాలు బయటపెడతాను. నాలాగే ఇంకో 300 మంది రేవంత్ రెడ్డి బాధితులు ఉన్నారు..అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇక కేవలం సోమశేఖర్ రెడ్డి మాత్రమే కాకుండా గద్వాల్ టికెట్ ని అలాగే 65 సీట్లని 600 కోట్లకు అమ్ముకున్నారని పిసిసి కార్యదర్శి కురువ విజయ్ కుమార్ బయట పెట్టారు.అలాగే రాగిడి లక్ష్మారెడ్డి కూడా తనకి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్లకు టికెట్ ఇచ్చారని కన్నీళ్లు పెట్టుకుంటూ తన శాపం తగులుతుంది అని మీడియా ముఖంగా తెలియజేశారు.
అంతేకాదు రేవంత్ రెడ్డి నోట్లకు సీట్లు అమ్ముకోకపోయి ఉంటే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ లో ప్రమాణం చేయాలని ఇప్పటికే పలువురు నాయకులు ఆయనకు బహిరంగంగా సవాల్ విసిరారు.

అయితే నాయకులు ఆరోపించే మాటలకు రేవంత్ మాట్లాడుతూ వారు ఎప్పటినుండో పార్టీలో ఉండడం వల్ల టికెట్ రాకపోవడంతో అలా అసంతృప్తితో మాట్లాడుతున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు అని చెప్పుకొస్తున్నారు.కానీ చాలామంది సీనియర్ నాయకులకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో పేరు రాకపోవడంతో మధు యాష్కీ వంటి కొంతమంది రహస్యంగా భేటీ అవుతున్నారట. ఇక విపక్షాలు కాకుండా సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని పై నిందలు వేయడంతో అందరూ అది నిజమే అని భావిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే ఓటుకు నోటు కేసు లో దొరికారు.ఇప్పుడు నోటుకి సీటు అమ్ముకుంటున్నారు అంటూ విమర్శిస్తున్నారు.ఇక సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డి ని ఆరోపించడంతో బిజెపి, బీఆర్ఎస్ లకి పండగ జరిగినంత ఆనందం కలుగుతుంది. Revanth Reddy

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp