Revanth Reddy to jail

Revanth Reddy: నిజామాబాద్ ఆర్మూర్ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తామని కల్వకుంట్ల కవిత పోటీ చేశారని చక్కెర కర్మాగారం తెరవకపోవడంతో నమ్మించి మోసం చేశారని అన్నారు. 2019లో వందమంది నామినేషన్లు వేశారని అన్నారు. 2009లో ఒక గుండు బాండ్ పేపర్ రాసి ఇచ్చాడని ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తామని బాండ్ పేపర్ రాసి ఇచ్చారని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

Revanth Reddy comments on farmers

పసుపు బోర్డు తెచ్చి పసుపు రైతుల్ని ఆదుకుంటునందుకు అరవింద్ ను గెలిపించారని మళ్ళీ గెలిపించండి పసుపు బోర్డు తెస్తానని అతను చెప్తున్నాడని ఈ ప్రాంత రైతులంటే లెక్కలేదు మోసం చేయొచ్చని మోడీ ధర్మపురి అరవింద్ అనుకుంటున్నారని నిజామాబాద్ రైతుల పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుండి పోయిన పడినట్లు అయిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ లో బిజెపి ఎమ్మెల్యే గెలిచి 150 రోజులు అయింది కేంద్రం నుండి ఏం తెచ్చాడు..? కేంద్రంతో మాట్లాడి మున్సిపల్ కార్యాలయం కూడా తీసుకురాలేదు.

Also read: Sathyam Rajesh: అక్కినేని నాగేశ్వరరావుని పెళ్లికి పిలిస్తే అవమానించారు…!

ఆర్మూర్లో బిజెపికి వేసిన ఓట్లు శుద్ధ దండగ అవుతున్నాయి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకువచ్చిన మోడీ మెడలు వంచి క్షమాపణ చెప్పిన పౌరుషం పంజాబ్ రైతులకి తెలంగాణలో ఆర్మూర్ నిజామాబాద్ రైతులు కూడా పంజాబ్ రైతులు కొట్లాడుతున్నారని అన్నారు. పసుపు బోర్డు రావాలని చక్కెర కర్మాగారం తొందరగా తెచ్చుకోవాలని జీవన్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలని రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి 47 కోట్ల బకాయిలు విడుదల చేసి చక్కెర కర్మాగారాన్ని తెరిపించడానికి ప్రయత్నం చేస్తున్నామని 500 రూపాయల బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనే బాధ్యత నాదని 9వ తేదీల్లోగా రైతుబంధువు వేస్తా లేకపోతే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు (Revanth Reddy).

Revanth Reddy to jail
Join WhatsApp