Sathyam Rajesh viral comments on Akkineni Nageshwar Rao

Sathyam Rajesh: ఉదయ్ కిరణ్ నటించిన నీ స్నేహం అనే మూవీలో రాజేష్ మొదటిసారి నటించారు.. అయితే ఈయన పేరు సత్యం రాజేష్ అని రావడానికి ప్రధాన కారణం అక్కినేని సుమంత్ హీరోగా చేసిన సత్యం సినిమాలో సుమంత్ కి ఫ్రెండ్ గా ముఖ్యపాత్ర లో నటించారు.అలా సత్యం మూవీని తన ఇంటిపేరుగా మార్చుకొని సత్యం రాజేష్ గా ఇండస్ట్రీలో దాదాపు పది సంవత్సరాలు కమెడియన్ గా పేరుగాంచారు.కానీ ఆ తర్వాత క్షణం మూవీ లో కమెడియన్ గా కాకుండా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో,త్రిష నాయకి మూవీలో హీరో పాత్రలో నటించారు.

Sathyam Rajesh viral comments on Akkineni Nageshwar Rao

అలాగే ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని హారర్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. మసూద, టెనెంట్,గీతాంజలి మళ్లీ వచ్చింది, పోలిమేర-2 వంటి హారర్ మూవీస్ లో కూడా ఈయన నటించారు.అయితే అలాంటి సత్యం రాజేష్ తన పెళ్లి సమయంలో అక్కినేని నాగేశ్వరరావుని ఆహ్వానించారట. మరి అలా పిలిచినప్పుడు ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. సత్యం రాజేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు వస్తున్నారంటే నేను చాలా భయపడిపోయే వాడిని.(Sathyam Rajesh )

Also Read: Sridevi: శ్రీదేవిని ప్రేమలో పడేసి శ్రీదేవి చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరో.. ఎవరంటే..?

ఆయన షూటింగ్లో అక్కడి నుండి నడుస్తూ వస్తున్నారంటే చాలా వణికేవాడిని. కానీ ఆ తర్వాత ఓ రోజు నా పెళ్లి సమయంలో ఆయన్ని నా పెళ్లికి ఆహ్వానించాలి అనుకున్నాను.అయితే ఎలాగోలా ఆయన దగ్గరికి వెళ్లి సార్ మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి అని అడిగాను. దానికి నాగేశ్వరరావు సరే కచ్చితంగా వస్తాను రాజేష్.పెళ్లి డేట్ ఎప్పుడు డేట్ తీసుకో అంటూ తన పిఏ కి చెప్పారు. అయితే నా పెళ్లి రోజు నాడు నాగేశ్వరరావు రాలేదు. కానీ సాయంత్రం ఫోన్ చేసి సారీ రాజేష్ నీ పెళ్లికి రాలేకపోయాను.

Sathyam Rajesh viral comments on Akkineni Nageshwar Rao

ప్రస్తుతం నేను అందుబాటులో లేను చెన్నైలో ఉన్నాను అని ఫోన్ చేసి మరీ నాకు విష్ చేశారు. అయితే ఆరోజు ఆయన రాకపోయినా వచ్చినంత హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద హీరో ఫోన్ చేసి మాట్లాడడం మామూలు విషయం కాదు కదా.. అంటూ సత్యం రాజేష్ ఆ ఇంటర్వ్యూలో అక్కినేని నాగేశ్వరరావు గురించి చెప్పుకొచ్చారు.(Sathyam Rajesh )

https://www.youtube.com/shorts/LLSSl0oLK9E

Join WhatsApp