Posani Krishna Murali: 15 ఏళ్ళ తర్వాత దర్శకుడిగా పోసాని.. ఆపరేషన్ అరుణారెడ్డి తో!! తో

తెలుగు సినిమా రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి సుమారు 15 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకుడిగా రంగంలోకి దిగారు. ఆయన చివరిగా 2011లో ‘దుశ్శాసన’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు తాజాగా ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ అనే సినిమాతో దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా మూడు పాత్రల్లో రాణిస్తున్నారు. ఈ సినిమా పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆయనే చూసుకోవడం విశేషం.

Posani’s Operation Aruna Reddy Comeback

తాజాగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో మ్యూజిక్ డైరెక్టర్ మహదేవ్ ఏలేందర్ మాట్లాడుతూ, పోసాని స్క్రిప్ట్లో డైలాగ్స్ తో పాటు లిరిక్స్ కూడా సొంతంగా రాసుకున్నారంటే, ఆయన ఎంత పక్కాగా ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇది పోసాని గారికి 2.0 వెర్షన్ లాగా మారుతుంది అని అన్నారు. హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ, ఈ సినిమా నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ, సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పారు.

నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ, పోసాని కృష్ణమురళి తనకు మంచి మిత్రుడు అని, వీరి కాంబినేషన్లో ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తామని చెప్పారు. పోసాని మాట్లాడుతూ, ఈ సినిమా బెస్ట్ స్క్రీన్ ప్లే అని, ప్రేక్షకులు సినిమా మొదలు చివర వరకు ఏం జరుగుతుందో ఊహించలేరు. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక్క బూతు కూడా లేదు, ఒక్క అసభ్య సన్నివేశం కూడా ఉండదు అని కన్ఫర్మ్ చేశారు.

పోసాని రచయితగా వంద సినిమాలు, నటుడిగా వందలాది సినిమాలు చేశారు. ఇప్పుడు మొత్తం ప్యాకేజీగా ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ తో ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్ తదితరులు నటిస్తున్నారు. మరి పోసాని ఇన్నేళ్ల తర్వాత ఎలాంటి మ్యాజిక్ చూపిస్తారో చూడాలి.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu