Prabhas: ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. బిగ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న ప్రభాస్.. అస్సలు ఊహించలేదుగా.?

Prabhas dropped out of a big projec
Prabhas dropped out of a big projec

Prabhas: ఏంటి ప్రభాస్ ఆ బిగ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారా.. ఈ గొడవలన్నీ మనకెందుకులే అని సైడ్ అయిపోయారా.. ఎందుకు ప్రభాస్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రభాస్ చేతిలో ఎన్నో ప్రాజెక్ట్ లు ఉన్నాయి. స్పిరిట్, ఫౌజీ, సలార్-2, కల్కి 2898AD సినిమాలతో పాటు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న ఓ సినిమాకి కూడా ఓకే చెప్పినట్టు ఆ మధ్య కాలంలో వార్తలు వినిపించాయి. ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ తర్వాత జై హనుమాన్ మూవీ తో పాటు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో బ్రహ్మ రాక్షస అనే సినిమాను చేయబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి.

Prabhas dropped out of a big projec

కానీ ఏమైందో ఏమో కానీ సడన్గా రణవీర్ సింగ్ తో చేయాల్సిన బ్రహ్మ రాక్షస సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ బ్రహ్మ రాక్షస సినిమా కోసం ప్రభాస్ ని అప్రోచ్ అయ్యారని, ప్రభాస్ కి కాన్సెప్ట్ బాగా నచ్చడంతో ఆయన ఈ సినిమాలో చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అలా ప్రభాస్ చేతిలో మరో బిగ్ ప్రాజెక్టు పడింది అని అందరూ అనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభాస్ ఆ ప్రాజెక్టు నుండి తప్పుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నయి.(Prabhas)

Also Read: Suma: చెక్ కొట్టేసింది.. సుమని మోసం చేసిన డైరెక్టర్.. కేసు పెడతానంటున్న యాంకర్.?

దానికి కారణం రీసెంట్గా ప్రశాంత్ వర్మకి సంబంధించిన కొన్ని నెగటివ్ వార్తలు నెట్టింట్లో వైరల్ అవ్వడమే.. ప్రశాంత్ వర్మ అడ్వాన్స్ తీసుకొని సినిమాలు చేయడం లేదనే ఆరోపణ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. అయితే ఈ ఆరోపణలపై స్వయంగా ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ గొడవలన్నీ మనకెందుకులే..

Prabhas dropped out of a big projec

ఇలా వివాదాల మధ్య ఉన్న డైరెక్టర్ తో సినిమా చేయడం ఎందుకు అని ప్రభాస్ నిర్ణయించుకొని బ్రహ్మా రాక్షస సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ప్రభాస్ ఈ గొడవలన్నీ మనకెందుకులే అని బ్రహ్మ రాక్షస సినిమా నుండి తప్పుకున్నారా.. లేక ఇవి ఇండస్ట్రీలో వినిపించే గాసిప్ లేనా అనేది తెలియాల్సి ఉంది.(Prabhas)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu