Pradeep Ranganathan: ‘డ్యూడ్’ మూవీ యూత్ ఫుల్ & ఎమోషనల్ ఎంటర్‌టైనర్

pradeep ranganathan dude movie review

నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు,నేహా శెట్టి, శరత్ కుమార్, హృదూ హరూన్ తదితరులు
దర్శకుడు: కీర్తిశ్వరన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
సంగీతం: సాయి అభ్యాంకర్
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
ఎడిటింగ్: భరత్ విక్రమన్

Pradeep Ranganathan DUDE Movie Review

తమిళంతో పాటు తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా సినిమా ‘డ్యూడ్’. ఈ సినిమా యూత్ ప్రేక్షకులు మరియు కుటుంబ ప్రేక్షకుల కోసం మల్టీ-ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంది. ప్రేమ, కుటుంబ బంధాలు, కామెడీ మరియు భావోద్వేగాలతో నిండి ఉన్న ఈ చిత్రం, ప్రధానంగా యువతకు మరియు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఆకర్షిస్తుందని చెప్తుండగా ఈరోజే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయి లో ఆకట్టుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ: గగన్ (ప్రదీప్ రంగనాథన్) లవ్ లో ఫెయిల్ అవుతాడు. కుందన (మమితా బైజు)… పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె. గగన్ కి మరదలు. ఐతే, తన మరదలి ప్రేమను గగన్ రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. మరదలి పై గగన్ మనసులో ప్రేమ పడుతుంది. నేరుగా వెళ్లి మావయ్యకి చెబుతాడు. సంతోషంగా వారి పెళ్లి చేయడానికి ఆదికేశవులు సిద్ధం అవుతాడు. ఆ తర్వాత గగన్, కుందన పెళ్లి అవుతుంది. మరి ఈ మధ్యలో వీరి పెళ్లికి వచ్చిన ప్రాబ్లెమ్ ఏంటి ?, మధ్యలో పెళ్లి వద్దని కుందన ఎందుకు అన్నది ?, ఇంతకీ.. పెళ్లి తర్వాత ఏమైంది ?, ఆ తర్వాత గగన్ ఎటువంటి త్యాగం చేశాడు ? పార్ధు (హృదూ హరూన్) ఎవరు ?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

నటీనటులు: ప్రదీప్ రంగనాథన్ తన సున్నితమైన కామెడీ మరియు భావోద్వేగాలు కలిపిన నటనతో ఆకట్టుకుంటాడు. మమితా బైజు తాను పోషించిన పాత్రలో ప్రామాణికతతో, భావోద్వేగాలతో, సహజతతో మెప్పించింది. శరత్ కుమార్ తన పాత్రలో సమర్థవంతమైన ప్రెసెన్స్ చూపించి, ముఖ్య సీన్‌లలో సీరియస్ అండ్ హ్యుమర్ బ్యాలెన్స్ అందించాడు. నేహా శెట్టి, హృదూ హరూన్, మరియు మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్లు తమ పాత్రలను బాగా పర్ఫార్మ్ చేశారు. మొత్తం నటీనటుల సమిష్టి ప్రదర్శన సినిమాకు ప్రాణం పోసింది.

సాంకేతిక నిపుణులు: దర్శకుడు కీర్తిశ్వరన్ కామెడీ మరియు ఎమోషనల్ సన్నివేశాలను సమతూకంగా నడిపించాడు. సాయి అభ్యాంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరియు పాటలు సినిమా వాతావరణానికి సరిపోయాయి. నికేత్ బొమ్మి తీసిన సినిమాటోగ్రఫీ విజువల్స్‌కి అందాన్ని మరియు శ్రద్ధను కల్పించింది. ఎడిటింగ్ కొద్దిగా సాగతీత సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, మొత్తం సినిమా ఫ్లోని ప్రభావితం చేయలేదు. నిర్మాతల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు సరిపోతుంది.

ప్లస్ పాయింట్స్:

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటన

సాయి అభ్యాంకర్ మ్యూజిక్

ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:

కీలక సీన్‌లు ఆసక్తికరంగా లేకపోవడం

మొదటి భాగం నెమ్మదిగా ఉండటం

తీర్పు: ‘డ్యూడ్’ ఒక యూత్ ఫుల్, ఎమోషనల్ & ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్. నటీనటుల ప్రదర్శన, సంగీతం, విజువల్స్ సినిమాకు బలం. కొన్ని సీన్స్, స్క్రీన్‌ప్లే సరిగ్గా లేకపోవడం పక్క పెడితే మొత్తం ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం సరదా, భావోద్వేగ అనుభూతిని ఇస్తుంది.

రేటింగ్ : 2.75/5

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu