Prasanth Kishore: రేవంత్ రెడ్డికి చెక్…KCRతో పని చేయనున్న ప్రశాంత్ కిషోర్ ?

Prasanth Kishore targets cm revanth reddy wih KCR

Prasanth Kishore: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం… ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ప్రజా సంఘాలతో పాటు ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో… ప్రశాంత్ కిషోర్ మరో బాంబు పేల్చారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని శపథం చేశారు. ఇటీవల బీహార్ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి… బీహార్ ఓటర్లను అవమానించారని ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు. Prasanth Kishore

Prasanth Kishore targets cm revanth reddy wih KCR

బీహార్ ఓటర్లు లేబర్లు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారట. అయితే ఇదే అంశాన్ని గుర్తుపెట్టుకున్న ప్రశాంత్ కిషోర్ పదే పదే… సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. కచ్చితంగా రేవంత్ రెడ్డిని ఓడించేదాకా తాను నిద్రపోనని శబ్దం కూడా చేశారు ప్రశాంత్ కిషోర్. తాను పగబడితే రాహుల్ గాంధీ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ దిగి వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ని ఎవరు కాపాడలేరని బాంబు పేల్చారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఓటర్ల డిఎన్ఏ పై రేవంత్ రెడ్డి మాట్లాడడం దారుణమని ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Prasanth Kishore

Also Read: Rahul Ramakrishna: సారే రావాలంటున్నాడే.. కేసీఆర్ ఏ కావాలంటున్నారే.. రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్…

బీహార్ ప్రజలను అవమానించి ఓట్లు ఎలా అడుగుతారని నిలదీస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని ఓడిస్తానని సవాల్ చేశారు ప్రశాంత్ కిషోర్. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు టచ్లోకి వెళ్లారట ప్రశాంత్ కిషోర్. వచ్చే ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ కోసం పనిచేస్తానని ప్రశాంత్ కిషోర్… నిర్ణయం తీసుకున్నారట. సీఎం రేవంత్ రెడ్డిని ఓడించేందుకు… ఎంతవరకైనా వెళ్తానని తేల్చి చెప్పారట. ఇది ఇలా ఉండగా… బీహార్ ఎన్నికల నేపథ్యంలో కొన్ని సర్వేలు కూడా బయటకు వచ్చాయి. ఈ సర్వే ప్రకారం గృహ కర్త ప్రశాంత్ కిషోర్ జన సూరత్ పార్టీకి 11 నుంచి 14 సీట్లు వస్తాయని తేలింది. మ‌రి ప్ర‌శాంత్ కిషోర్ శ‌ప‌థం పై కాంగ్రెస్ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. Prasanth Kishore

Also Read: Sana Mir Azad Kashmir: అజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. సనా మిర్ వివాదం ఏంటీ…

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu