
Danish Kaneria: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో పాకిస్తాన్ జట్టులో ఉంటూ… ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు డానిష్ కనేరియా. అయితే ఈయన పూర్వీకులు ఇండియాకు చెందినవారు. అంతేకాదు పాకిస్తాన్ లో ఉన్న హిందువు. అందుకే ప్రతిసారి భారతదేశ అలాగే హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాడు డానిష్ కనేరియా. అదే సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కూడా విమర్శలు చేస్తూ ఉంటాడు. Danish Kaneria
Danish Kaneria Denies Indian Citizenship Amid Discrimination Revelations
అలాంటి డానిష్ కనేరియా ఇండియా పౌరసత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కు అనుకూలంగా ఇటీవల డానిష్ కనేరియా కామెంట్స్ చేసిన నేపథ్యంలో.. అతని టార్గెట్ చేసి పాకిస్తాన్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇండియాకు వెళ్ళేందుకే డానిష్ కనేరియా ఆర్ఎస్ఎస్ ను పొగుడుతున్నాడని.. ఇస్తాను ఇస్లాం మతస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Nitish Kumar Reddy: పక్షిలా ఎగిరి క్యాచ్ పట్టిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్…
అయితే ఈ అంశంపై తాజాగా డానిష్ కనేరియా స్పందించాడు. తనకు హిందూ ధర్మం అంటే చాలా ఇష్టమని, కానీ ఇండియాకు రావడంలేదని క్లారిటీ ఇచ్చాడు. తన పుట్టినిల్లు పాకిస్తాన్ అయినప్పటికీ… మాతృభూమి మాత్రం ఇండియా అంటూ వ్యాఖ్యానించారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని… చివరి వరకు పాకిస్తాన్ లో ఉంటానని వివరించాడు. గతంలో తనను ఇస్లాం మతంలోకి మారాలని షాహిద్ అఫ్రిదీ లాంటి క్రికెటర్లు కూడా టార్చర్ పెట్టినట్లు కూడా పూర్తి చేశాడు. ఏది ఏమైనా పాకిస్తాన్ లోనే ఉంటానని… ఇండియాను పొగుడుతానని కూడా చెప్పగానే చెప్పాడు.
Also Read: Prasanth Kishore: రేవంత్ రెడ్డికి చెక్…KCRతో పని చేయనున్న ప్రశాంత్ కిషోర్ ?




















