
Patika: పటిక ప్రతికూల శక్తులను తొలగించడానికి సహాయం చేస్తుంది. పటిక ప్రతికూల శక్తులను గ్రహించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రతిరోజు నీటిలో కొద్దిగా పటికను వేసుకొని ఇంటిని శుభ్రపరచుకుంటే చాలా మంచిది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. పటికను ఇంట్లో శాంతి మరియు సంపద, ఆనందం కోసం వాడుతూ ఉంటారు. పటికను వాడడం వల్ల సానుకూల శక్తులు పెరుగుతాయి. వ్యాపార వృద్ధికి ఎంతగానో సహాయం చేస్తుంది. వ్యాపారంలో నష్టాలు, అభివృద్ధి చెందకపోవడం లాంటి సమస్యలతో సతమతమయ్యేవారు పటికను వాడాలి. ఒక నల్లటి వస్త్రంలో పటికను వేసి ఇంటి ప్రధాన ద్వారం ముందు వేలాడదీయాలి. ఇది వ్యాపారంలో శ్రేయస్సును తీసుకువస్తుంది. చెడు దృష్టి ప్రభావాలను తొలగిస్తుందని నమ్ముతారు. Patika
Patika Vastu Tips in homes
చిన్నపిల్లలు రాత్రి సమయంలో పీడ కలలు వచ్చి భయపడతారు. రాత్రి నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటారు. అలాంటి వారికి మంగళవారం లేదా శనివారం రాత్రి పడుకునే సమయంలో వారి మంచం వద్ద పటికను ఉంచాలి. ఇది పిల్లల నిద్రను మెరుగుపరుస్తుంది. భయం పోగోడుతుంది. పీడ కలలు, రాత్రులు ఏడవడం లాంటి సమస్యలు ఉండవు. వైవాహ జీవితంలో భార్య భర్తల మధ్య వివాదాలు వస్తూ ఉంటాయి. అలాంటివారు నల్లటి వస్త్రంలో పటికను కట్టి మంచం వద్ద ఉంచాలి. ఇలా చేయడం వల్ల భార్య భర్తల మధ్య పరస్పర సంబంధాలు మెరుగుపడతాయి. ఆందోళన లాంటి సమస్యలు తొలగిపోతాయి. Patika
Also Read: Nitish Kumar Reddy: పక్షిలా ఎగిరి క్యాచ్ పట్టిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్…
చాలా కాలం నుంచి అప్పుల బాధలో ఉన్నట్లయితే పటిక ముక్కను ఇంట్లో పెట్టుకోవాలి. బుధవారం రోజున పటికను తీసుకొని దానికి కాస్త సింధూరం రాసి తమలపాకుతో చుట్టూ దారంతో ఇంట్లో కట్టాలి. ఆ తర్వాత సాయంత్రం పూట దానిని రావి చెట్టు కింద పాతిపెట్టాలి. ఈ పరిహారం చేసినట్లయితే అప్పుల నుంచి బయటపడవచ్చు. పటిక ఇంటికి ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలను తీసుకువస్తుందని పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో పటికను పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదు. సంతోషంగా ఉండవచ్చు. Patika
Also Read: Prasanth Kishore: రేవంత్ రెడ్డికి చెక్…KCRతో పని చేయనున్న ప్రశాంత్ కిషోర్ ?

