Protein Intake: ఖరీదైన సప్లిమెంట్స్ లేకుండా ఇంట్లో ప్రోటీన్ పెంచే 5 హ్యాక్స్

ప్రోటీన్ ఇన్టేక్ పెంచుకోవడానికి ఖరీదైన సప్లిమెంట్స్ అవసరం లేదు. ఇంటి భోజనంలో కొన్ని సింపుల్ మార్పులు చేస్తే సరిపోతుంది. బెంగళూరులోని ఆస్టర్ సీఎంఐ హాస్పిటల్కు చెందిన న్యూట్రిషనిస్ట్ ప్రవళిక లోండే ఐదు సులభమైన టిప్స్ షేర్ చేశారు. కండరాలు, రోగనిరోధక శక్తి, మెటబాలిజం ఆరోగ్యానికి ప్రోటీన్ కీలకం.

ముందుగా, భోజనంలో పప్పు, మొలకలు, కాల్చిన చనా జోడించండి. ఇవి ఈజీగా దొరికే cheap sources. మొలకల్ని సలాడ్స్, పోహా, శాండ్విచ్లలో కలపొచ్చు. లంచ్ లేదా డిన్నర్తో ఒక గిన్నె పప్పు తీసుకుంటే ప్రోటీన్ ఇన్టేక్ పెరుగుతుంది. రెండవది, పనీర్, పెరుగు, పాలను వాడండి. వీటిని పరాటాలు, సబ్జీలు, పులావ్లలో చేర్చొచ్చు. పెరుగులో ప్రోటీన్తో పాటు కాల్షియం ఉంటుంది, గట్ హెల్త్కి కూడా మంచిది.

మూడవది, మల్టీగ్రెయిన్ రోటీలు లేదా చీలాలు తయారు చేయండి. గోధుమ పిండితో బేసన్, రాగి, సోయాబీన్ పిండి లేదా సత్తు కలపడం వల్ల పోషకాలు పెరుగుతాయి. ఇది ఫైబర్ కూడా ఇస్తుంది. నాల్గవది, స్నాక్స్ మరియు బ్రేక్ఫాస్ట్లో నట్స్ మరియు సీడ్స్ జోడించండి. వేరుశెనగ, బాదం, నువ్వులు, అవిసె గింజలను పెరుగు, స్మూతీస్, వోట్స్ లేదా సలాడ్లపై చల్లుకోవచ్చు. వేరుశెనగ చట్నీ కూడా హెల్తీ ఆప్షన్.

ఐదవది, నాన్-వెజ్ తినేవారు గుడ్లు, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. ఉడికించిన గుడ్లను స్నాక్స్గా తినొచ్చు. సోయా చంక్స్ను కూరలు, పులావ్లో వేసుకోవచ్చు. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తింటే బలం పెరుగుతుంది, రికవరీ బాగా అవుతుంది, ఆకలి త్వరగా వేయదు. కానీ పోర్షన్ కంట్రోల్ కోసం డైటీషియన్ను కన్సల్ట్ చేయడం మంచిది. ఈ హ్యాక్స్తో మీ ప్రోటీన్ ఇన్టేక్ సులభంగా పెంచుకోండి.

Share your love