Ram Charan: త్వరలో RC17 సెట్స్లోకి, హ్యాండ్ సర్జరీ విజయవంతం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ కి ఒక ఊరట కలిగించే సంగతి ఏంటంటే, Ram Charan కి కుడి చేతి మణికట్టుకు విజయవంతంగా సర్జరీ అయింది. కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న ఆయనకు కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్ లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. టాప్ సర్జన్స్ టీం ఈ ఆపరేషన్ చేసింది, ప్రస్తుతం ఆయన బాగా కోలుకుంటున్నారు.

Ram Charan Hand Surgery Success

ఈ సర్జరీకి డాక్టర్ రాజశేఖరన్ లీడ్ చేశారు, అమెరికా నుంచి డాక్టర్ అలెహాండ్రో బాడియా అనే hand specialist ని కూడా ప్రత్యేకంగా పిలిపించారు. ఆయనకు appointment దొరకడం చాలా కష్టం అంటారు, కానీ రామ్ చరణ్ కోసం స్వయంగా భారత్ వచ్చి సర్జరీలో పాల్గొన్నారు. డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ సహా ఈ మొత్తం టీం చాలా జాగ్రత్తగా ఆపరేషన్ పూర్తి చేసింది.

ఈ గాయం ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలోనే జరిగింది. అప్పట్లో వైద్యులు సర్జరీ చేయమని సూచించినా, సినిమా షూటింగ్, ప్రమోషన్లకు అంతరాయం కాకూడదని ఆయన వాయిదా వేశారు. నొప్పితోనే షూటింగ్ పూర్తి చేశారు, సినిమా హిట్ అయింది. ఇప్పుడు ‘పెద్ది’ విజయం అయ్యాక, డాక్టర్ల సలహా మేరకు ఈ ఆపరేషన్ చేయించుకున్నారు.

ప్రస్తుతం మరో నాలుగు రోజులు కోయంబత్తూరులోనే రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి మరికొన్ని వారాలు పూర్తి రిలాక్స్ అవుతారు. ఫిజియో థెరపీ, రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ తో పూర్తి రికవరీ అయ్యాక, వెంటనే RC17 సెట్స్ లో జాయిన్ అవుతారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు.

https://x.com/pakkafilmy007/status/1600352362639822848

Share your love