
Meesala Pilla song: చిరంజీవి హీరోగా.. నయనతార హీరోయిన్ గా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా మూవీ శివశంకర వరప్రసాద్ గారు.. ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధంగా ఉంది.ఇప్పటికే షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించి ఓ మీసాల పిల్ల అనే పాటని రిలీజ్ చేశారు.అయితే ఈ పాటలో ఒకప్పటి సింగర్ ఉదిత్ నారాయణని తీసుకువచ్చి పాడించారు.
Trolls on Meesala Pilla song
అయితే తాజాగా మీసాల పిల్ల ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ పాటకి సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. అసలు ఇందులో హీరో చిరంజీవి ఎక్స్ప్రెషన్స్ సెట్ అవ్వలేదని, నయనతార చిరంజీవిల మధ్య ఉన్న కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవ్వలేదని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి మీసాల పిల్ల పాటని ఫీలవుతూ పాడుతూ ఉంటే దరిద్రంగా ఉంది అని కామెంట్లు పెడుతున్నారు. (Meesala Pilla song)
Also Read: Siddu: ప్రతిసారి టిల్లు నే కనిపిస్తే ఎలా సిద్ధు.. బోల్డ్ సీన్స్ కోసం?
ఇక మరికొంత మందేమో లిటిల్ హార్ట్స్ మూవీ లోని కాత్యాయిని మాట్లాడిన వీడియో ని పెట్టి ఇదేం కర్మరా నాయనా మాకు.. అన్నట్లుగా మీసాల పిల్ల పాటపై ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే చిరంజీవి నటించిన సినిమాల్లో ఒక పాటకి ఇంతలా ట్రోలింగ్ రావడం మాత్రం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి.ఓ పక్క చిరంజీవి మీసాల పిల్ల పాటను ఎత్తేస్తూ కొంతమంది బాగుందని పొగుడుతూ ఉంటే

మరి కొంతమందేమో ఇలా మీసాల పిల్ల పాట పై ట్రోలింగ్ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.అలా ప్రస్తుతం మీసాల పిల్ల పాటకి చిరంజీవి ఎక్స్ప్రెషన్స్ కి సంబంధించిన వీడియో ని లిటిల్ హార్ట్స్ మూవీలోని కాత్యాయిని అన్న మాటల్ని పెట్టి ఎడిటింగ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేం కర్మరా మాకు బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Meesala Pilla song)





