
RCB on Sale: రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్టు అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బెంగళూరు జట్టును అమ్మేసేందుకే సిద్ధమైంది యాజమాన్యం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ లోపు ఈ సేల్ ప్రక్రియ ముగించేయాలని ప్లాన్ చేస్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. RCB on Sale
RCB on Sale 5 PARTIES ARE INTERESTED
ప్రస్తుత పరిస్థితులలో జట్టును భరించలేని స్థితిలో డియాగో కంపెనీ ఉందట. అందుకే సేల్ చేసేందుకు సిద్ధమైందట. 2025 టోర్నమెంట్ గెలిచినప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనసాగించలేమని వెల్లడించిందట. దీంతో సేల్ ప్రక్రియ ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వేలంలోకి వస్తే… ఐదు కంపెనీలు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాయట. అదాని కంపెనీ అలాగే JSW గ్రూప్ రెండు కూడా ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అదార్ పూనావాలా కంపెనీ, అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ ఇన్వెస్ట్ కంపెనీ కూడా సిద్ధంగా ఉందట. RCB on Sale
Also Read: Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఎన్నికల తరువాత తెలంగాణ కేబినెట్ నుండి ముగ్గురు మంత్రులు ఔట్…
అటు దేవయాని ఇంటర్నేషనల్ గ్రూప్ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఎన్ని కోట్లు అయినా పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్ధమైందట. ప్రస్తుతం రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు వ్యాల్యూ 17,600 కోట్లు అని తెలుస్తోంది. అంత మొత్తం చెల్లిస్తే ఖచ్చితంగా అమ్మేసేందుకు బెంగళూరు యాజమాన్యం సిద్ధంగా ఉందని సమాచారం. ఈ విషయం బయటకు రావడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు షాక్ అవుతున్నారు. RCB on Sale
Also Read: Jubilee Hills Survey: జూబ్లీహిల్స్ లో విజయం వారిదే..తేల్చేసిన చాణక్య సర్వే రిపోర్ట్




















