
Telangana Cabinet: తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 6 గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పై జనాలు ఆగ్రహంతో ఉన్నట్లు సర్వే రిపోర్ట్ లు కూడా చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇప్పటికే కేకేతో పాటు చానణ్య సర్వే రిపోర్ట్ బహిర్గతం చేసింది. Telangana Cabinet
Three ministers out of Telangana cabinet after Jubilee Hills election
అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ కేబినెట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయట. ఈ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు ఔట్ అవుతారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ ముగ్గురిని తొలగించి కొత్తగా ముగ్గురికి అవకాశం ఇవ్వబోతున్నారట. మహేష్ కుమార్ గౌడ్, విజయశాంతి అలాగే బాలు నాయక్ కు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. Telangana Cabinet
Also Read: Jagan: జగన్ బిగ్ స్కెచ్…ఆ పార్టీలో పొత్తు, ఇక కూటమి చిత్తు, చిత్తే ?
పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలాగే కొండా సురేఖ పదవులను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత దీనిపై ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. పొన్నం ప్రభాకర్ కు తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కూడా ఇవ్వబోతున్నారట. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పై తగ్గుతున్న ప్రజాదారణ పెంచుకునేందుకు ఈ విధంగా హైకమాండ్ ఆలోచన చేస్తుందట. సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు మొదటగా ఈ విషయాన్ని తన పత్రికలో ఆర్టికల్ రాసారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడేక్కాయి. Telangana Cabinet
Also Read: Telangana: రేవంత్ సర్కార్ లో మరో సంచలనం..బాంబ్ పేల్చిన మంత్రి ?




















