

Tirumala: తిరుమల సన్నిధిలో మరో వివాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో రాజకీయ పోస్టర్ తాజాగా కలకలం రేపింది. ఏకంగా శ్రీవారి ఆలయం ముందు అన్న డీఎంకే పోస్టర్ తో రచ్చ చేశారు కొంతమంది అన్న డీఎంకేకు సంబంధించిన నాయకులు.
పోస్టర్ లో పొలిటికల్ లీడర్స్ జయలలిత, పలని స్వామి చిత్రాలు కూడా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన అన్న డీఎంకే కార్యకర్తలు, ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. Tirumala
Reels with ADMK poster in front of Tirumala Srivari Temple
అయితే ఈ విషయాన్ని అక్కడ ఉన్న అధికారులు గమనించకపోవడంతో, అన్న డీఎంకే పార్టీకి సంబంధించిన పోస్టర్ బయటకు తీసి రీల్స్ కూడా చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపడంతో, వీడియో కూడా బయటకు వచ్చింది. ఇది చూసిన తిరుమల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Tirumala
Also Read: Raghu Rama Krishna Raju: రఘురామ కృష్ణరాజు సస్పెండ్? ట్వీట్ వైరల్
ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన చిత్రాలు తిరుమల కొండపై ఎందుకు పెడుతున్నారని నిలదీస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా టీటీడీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఫైర్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు రోజుకొకటి జరుగుతోందని నిప్పులు చెరుగుతున్నారు. Tirumala
Also Read: Chandrababu Naidu: అలిపిరి ఘటన..తిరుమల శ్రీవారిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..?







