

Tirumala: తిరుమల సన్నిధిలో నిత్యం ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా కొండపై వీడియోలు తీస్తున్నారు జనాలు. భద్రత సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడంలేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలాసార్లు అధికారులు వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా జనాలు రెచ్చిపోతున్నారు. Tirumala
Tirumala new couple photo shoot
తాజాగా మరోసారి తిరుమల శ్రీవారి సన్నిధిలో వివాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలలో కొత్తజంట ఫోటోషూట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు బయటకు వచ్చాయి. ఇంకేముంది ఆ కొత్త జంటపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్లింగ్ జరుగుతుంది. Tirumala
Also Read: Deputy CM Ajit Pawar : అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సంచలన వీడియో
గొల్ల మండపం నుంచి అఖిలాండం వరకు నిబంధనలు ఉంటాయి. అయితే ఈ రూల్స్ కు వ్యతిరేకంగా ఈ జంట వివిధ భంగిమలలో ఫోటోలు దిగి భక్తులకు ఆగ్రహం తెప్పించారు. తిరుమలలో ఫోటోషూట్లు అలాగే రీల్స్ చేయడంపై ఇప్పటికే నిషేధం విధించింది టిటిడి పాలక మండలి. అయినప్పటికీ ఈ జంట వివిధ భంగిమలలో ఫోటోలు దిగడం హాట్ టాపిక్ అయింది. Tirumala
Also Read: Ajit Pawar-plane crash: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి







