Rekha Vedavyas: ప్రేమ, పెళ్లిపై సంచలన ఇంటర్వ్యూ.. ఆనందం ఫేమ్ ‘ రేఖ’

అందరూ గుర్తుపెట్టుకున్న ఆనందం సినిమా హీరోయిన్ రేఖా వేదవ్యాస్ ప్రస్తుతం తన ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటి, ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడింది. సల్మాన్‌ఖాన్ లాగే తాను కూడా సింగిల్‌గానే ఉండిపోవడం జరుగుతుందేమోనని ఆమె నవ్వుతూ చెప్పింది. ఇప్పటికీ తనని సింగిల్ అని చెప్పినా చాలామంది నమ్మడం లేదని, ఎవరో ఒకరు తన లైఫ్‌లో ఉంటారని అనుకుంటున్నారని చెప్పింది. ఇక ముందుకు పెళ్లి గురించి ఆమె చెప్పిన విషయాలు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి.

Rekha Vedavyas Single Life Truth

తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే ప్రశ్నకు రేఖ చాలా సింపుల్‌గా సమాధానం ఇచ్చింది. చిన్నప్పుడు తను కూడా ఎన్నో డిమాండ్‌లు, అంచనాలు పెట్టుకునేదాన్నని, కానీ ఇప్పుడు ఆలోచనలు చాలా మారిపోయాయని చెప్పింది. పర్ఫెక్ట్ మనిషి ఈ ప్రపంచంలో ఎవరూ లేరని, తాను కూడా పర్ఫెక్ట్ కాదని స్పష్టం చేసింది. తనను నిజంగా ప్రేమించే ఒక మంచి మనిషి దొరికితే చాలు, ఎత్తు, రంగు, లుక్స్ ఏమీ ఇష్టం లేదని అంది. మంచి హార్ట్ ఉన్న వ్యక్తి జీవితాంతం నిలిచే అందం అని ఆమె అభిప్రాయపడింది. పెళ్లి ఉద్దేశం ఉన్నవాళ్లు తన ఇన్‌స్టాగ్రామ్‌కి మెసేజ్ చేయొచ్చని కూడా ఫన్‌గా చెప్పింది, కానీ టైంపాస్ కి కాదు, లైఫ్ పార్టనర్ గా ఆలోచించేవాళ్లు మాత్రమే సంప్రదించాలని సీరియస్‌గా సూచించింది.

ప్రేమ, క్రష్, ఇన్ఫ్యాచుయేషన్, అబ్సెషన్ మధ్య తేడాను కూడా రేఖ ఈ ఇంటర్వ్యూలో చక్కగా వివరించింది. ఇన్ఫ్యాచుయేషన్ అంటే ఎవరితోనైనా రిలేషన్‌లో ఉంటే బాగుంటుంది అనిపించడం, అది హానికరం కాదని చెప్పింది. కానీ అబ్సెషన్ మాత్రం చాలా డేంజరస్ అని, అది “ఆ వ్యక్తి నాకే కావాలి” అనే స్వార్థ భావన అని అంది. ప్రేమలో మోసం చేసే వారికి కర్మ నుంచి తప్పించుకోవడం కష్టమని, ప్రతి యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందని తను గట్టిగా నమ్ముతానని చెప్పింది. వన్‌సైడ్ లవ్ చాలా పవర్‌ఫుల్ అని చెప్పిన ఆమె, అయితే ఆ ప్రేమను మనసులోనే దాచుకోకుండా సరైన సమయంలో ధైర్యంగా ఒప్పుకోవాలి అని యంగ్‌స్టర్స్‌కు సలహా ఇచ్చింది.

నిజమైన ప్రేమను గౌరవించాలి, కుటుంబ సభ్యుల అనుమతితో ముందుకు వెళ్లాలి అనేది రేఖ స్పష్టమైన మెసేజ్. తన సింగిల్ లైఫ్ గురించి సీరియస్‌గా చెప్పిన ఆమె, ఇప్పటికీ నమ్మకాలు, విలువలతో జీవిస్తుంది. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చాలామంది రేఖ మెచ్యూరిటీ, మెసేజ్‌ను ఆప్రిషియేట్ చేస్తున్నారు. ప్రేమలో, పెళ్లిలో ట్రూ లవ్ కి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలనే ఆమె థాట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Share your love