

The Raja Saab: రేవంత్ రెడ్డి సర్కారుపై మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ హీరోల మధ్య ద్వంద్వ వైఖరితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు సోషల్ మీడియాలో గులాబీ పార్టీ నేతలు వార్తలు వైరల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఒక న్యాయం ? రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకు ఒక న్యాయమా ? అంటూ గులాబీ పార్టీ కొత్త అంశానికి తెరలేపింది. The Raja Saab
Revanth Sarkar is doing injustice to the movie The Raja Saab
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా మొన్న ఎనిమిదో తేదీన రిలీజ్ అయింది. ఏపీలో ప్రీమియర్లు పడగా, తెలంగాణలో మాత్రం పర్మిషన్లు ఇవ్వలేదు. టికెట్ల ధరలు పెంచుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో ఉన్న ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. కానీ ఇంకా రిలీజ్ కానీ మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు మాత్రం అన్ని పర్మిషన్లు వచ్చాయి. The Raja Saab
Also Read: komatireddy venkat reddy: నాకింత విషమిచ్చి చంపేయండి..లేడీ ఐఏఎస్ వార్తలపై సీరియస్?
దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తోంది గులాబీ పార్టీ. గతంలో కేటీఆర్ ను కలిసినప్పుడు కెసిఆర్ ప్రభుత్వం రాబోతుందని ప్రభాస్ పెద్దమ్మ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన మనసులో పెట్టుకున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రభాస్ సినిమాకు దెబ్బ వేశాడని అంటున్నారు. అందుకే ఇలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి పై గులాబీ పార్టీ విమర్శలు చేస్తోంది. The Raja Saab
Also Read: Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న నుంచి చేజారిపోయిన Q News యూట్యూబ్ ఛానల్ ?







