Shruti Haasan marriage: ఆ ఒక్కటి అడగొద్దు అంటూ ఫన్నీ రిప్లయ్

Scene from Telugu cinema

తాజా ఇంటర్వ్యూలో శృతి హాసన్ మ్యారేజ్ ప్రశ్నలకు చాలా మజాగా సమాధానం చెప్పింది. తనను పెళ్ళి విషయం గురించి అడగవద్దని అంటూ అభిమానులకు ఒక ఫన్నీ రిప్లయ్ ఇచ్చింది. ప్రస్తుతం తన లైఫ్ లో కొత్త ఛాప్టర్ మొదలైందనీ, అందులో సినిమాలే ప్రధానమని చెప్పింది.

మనసు మార్చుకున్న శృతి.. మ్యారేజ్ కాదు ఇప్పుడు సినిమాలే

బాలీవుడ్ నుంచి దక్షిణాది సినిమాల మీద ఫోకస్ పెట్టడానికి శృతి హాసన్ ముంబై నుంచి చెన్నైకి షిఫ్ట్ అయింది. ఇటీవల శంతను హజారికా తో బ్రేకప్ తర్వాత తనకు సినిమాలే ప్రపంచం అని చెబుతుంది. సోషల్ మీడియా లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చింది. ముఖ్యంగా పెళ్ళి గురించి అడిగిన ప్రశ్నలకు ఆ ఒక్కటి తప్ప మరేదైనా అడగండి అంటూ ఫన్నీ రిప్లయ్ ఇచ్చింది.

ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో దుల్కర్ సల్మాన్ తో కలిసి ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు పవన్ సాదినేని డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. పదే పదే అదే ప్రశ్న అడగొద్దని అభిమానులను అర్ధించింది. తన కెరీర్ లో ఇది ఒక కొత్త దశ అని స్పష్టం చేసింది.

పెళ్ళి గురించి ఎప్పుడూ అడిగే అభిమానులు ఇక ఆగాల్సిందేనని చెప్పవచ్చు. శృతి మ్యారేజ్ అనే మాట విన్నప్పుడు కూడా బోరింగ్ గా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది. సినిమాల మీద తన ఫోకస్ ను మరింతగా పెంచుకుంది. తన నటనా ప్రస్థానంలో కొత్త అడుగులు వేస్తుందని అర్ధం అవుతుంది. ఈ విషయాలు మీడియాలో వైరల్ గా మారాయి.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu