అఖిల్ అక్కినేని తన సినీ కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన చిత్రంగా భావించే సిసింద్రీ సినిమా త్వరలో ‘సిసింద్రీ 2’ గా రానుందా? ప్రస్తుతం 2026లో తన కొడుకు పుట్టిన తర్వాత ఈ సినిమా రీమేక్ ని కంఫర్మ్ చేస్తూ అఖిల్ ఓ ఎమోషనల్ అప్డేట్ ఇచ్చాడు. సిసింద్రీ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని, ఆ గుర్తింపును తర్వాతి జనరేషన్ కి కూడా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు.
Sisindri 2 Akhil Remake Plans
నాగార్జున 1995లో హాలీవుడ్ రీమేక్ గా తీసిన సిసింద్రీ సినిమా అప్పట్లో బోలెడంత ఫేమ్ తెచ్చిపెట్టింది. శివేశ్వరరావు దర్శకత్వంలో నాగార్జున, అఖిల్, ఆమని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికీ కూడా ఆ సినిమా చూస్తే పిల్లలు నవ్వుతారు, ఫ్యామిలీతో టైమ్ పాస్ చేయొచ్చు. లెనిన్ సినిమాతో హిట్ కొట్టిన అఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిసింద్రీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశాడు.
తనకు కొడుకు పుడితే ఖచ్చితంగా సిసింద్రీ 2 చేస్తానని, ఈ విషయం తన వైఫ్ జైనబ్ కు చెప్పానని, ఆమె కూడా ఓకే చెప్పిందని అఖిల్ తెలిపాడు. నాకు చిన్నప్పుడు వచ్చిన గుర్తింపును నా కొడుకు కూడా పొందడం నాకు చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు అఖిల్ కి కొడుకు పుట్టడం పూర్తయింది కాబట్టి, సిసింద్రీ 2 కోసం ఎదురుచూపు మొదలైంది.
ఆ సినిమా అనుభవాల గురించి చెప్తూ, తను పది గంటలు నిద్రపోయి మిగతా టైమ్ మాత్రమే అవేక్ గా ఉండేవాడినని, నిద్ర లేచినప్పుడు షూటింగ్ చేసేవారని అఖిల్ గుర్తు చేసుకున్నాడు. నన్ను నవ్వించాలంటే నాన్న కెమెరా వెనక్కి వెళ్లి నవ్వించేవారు, నేను ఏడవాలంటే అమ్మ కార్ ఎక్కి బాయ్ చెప్పి వెళ్లిపోయేది. ఆమని గారి ఫేస్ కనిపించకుండా మా అమ్మని పెట్టి కూడా కొన్ని సీన్స్ షూట్ చేసారని షేర్ చేశాడు. ఇప్పుడు సిసింద్రీ 2 కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.





Akkineni Akhil: ఆస్తి విషయంలో నాగార్జునపై అఖిల్ సంచలన కామెంట్స్