Horoscope on October 17th 2023

Horoscope on October 17th 2023

Horoscope today :

మేషం: వృత్తి , వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగ పరంగా అధికారుల ఆగ్రహానికి గురికావలసి రావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి.

వృషభం: స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మిధునం: వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలను చర్చిస్తారు. కీలక వ్యవహారాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యాపార పరంగా సొంత నిర్ణయాలు కలిసి రావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

సింహం: ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిరాశ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య: ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలు పరిష్కరిస్తారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు . మొండి బాకీలు వసూల్ అవుతాయి.

తుల: నిరుద్యోగుల కష్టం ఫలించదు. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

Also Read : Horoscope today : ఈ రాశుల వారికి అన్నీ శుభవార్తలే..!

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. గృహాపకరణాలను కొనుగోలు చేస్తారు..సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. దూర ప్రాంతం నుండి శుభవార్తలు వింటారు.

ధనస్సు: వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగమున ఆకస్మిక స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. దైవచింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి.

మకరం: దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు..ఉద్యోగమున ఉన్నతాధికారులతో చక్కగా వ్యవహరిస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.

కుంభం: ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగిపోతాయి. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

మీనం: నిరుద్యోగులకు అవకాశాలు చేజారి పోతాయి. దూర ప్రయాణాలు అతి కష్టం మీద పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. మిత్రులతో ఊహించని వివాదాలు ఏర్పడతాయి.

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp