Baby Is On The Way MS Dhoni Wife Sakshi Urges CSK To Finish The Match Early

Ms Dhoni: ఇండియన్ ప్రీమియర్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇప్పటివరకు చాలా మ్యాచ్ లు జరిగాయి. దాదాపు 50 మ్యాచ్లు పూర్తయ్యాయని చెప్పవచ్చు. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లో భారీ స్కోరు నమోదు అయ్యాయి. హైదరాబాద్ జట్టయితే 286 పరుగులు చేసి సంచలన రికార్డు నమోదు చేసింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఘోర పరాభవం ఎదురయింది. Ms Dhoni

Baby Is On The Way MS Dhoni’s Wife Sakshi Urges CSK To Finish The Match Early

ఆదివారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఏకంగా 78 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. నిన్న జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది.

Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ పై నిషేధం… ఐపీఎల్ 2024 నుంచి ఔట్ ?

అనంతరం బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి నుంచి విఫలమవుతూనే వచ్చింది. Top order నుంచి మిడిల్ ఆర్డర్ వరకు అందరూ విఫలమయ్యారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది హైదరాబాద్. 18.5 ఓవర్లలో 134 పరుగులు చేసి… 78 పరుగులతో ఓడిపోయింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.

ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ధోని భార్య అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిన్న మ్యాచ్ సందర్భంగా ధోని భార్య సాక్షి… బేబీ వస్తోంది… మ్యాచ్ త్వరగా ముగించండి…. కాబోయే అత్తగా నా రిక్వెస్ట్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ధోని భార్య సాక్షి. దీంతో ధోని మామ కాబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. అది కాదు మరో శుభవార్త అయి ఉంటుందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Join WhatsApp