How do franchises get thousands of crores in IPL 2024

IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్చి నెలలో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ మే చివరి వరకు కొనసాగనుంది. ఇక ఇప్పటివరకు ఆ ఇండియన్ ప్రీమియర్ లీగ్… 2024 టోర్నమెంటులో 48 మ్యాచులు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లోనే ఈ టోర్నమెంట్ కూడా ముగియనుంది. IPL 2024

How do franchises get thousands of crores in IPL 2024

ఇక ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో జట్టు 250కి పైగా పరుగులు చేయగలుగుతోంది. బ్యాటింగ్ చేసిన ప్రతి టీం 200కు పైగా పరుగులు చేయడమే కాకుండా 300 వైపు పరుగులు పెడుతోంది. ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ లాంటి జట్లు 250కి పైగా పరుగులు చేశాయి. IPL 2024

Also Read: Ms Dhoni: బేబీ ఈజ్ ఆన్ ది వే- గుడ్ న్యూస్ చెప్పిన సాక్షి ధోనీ

ఈ ఏడాది ఎలాగైనా 300 పరుగులు చేసేలా కనిపిస్తున్నాయి పరిణామాలు. ఇక ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత కోల్కత్తా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2024 టోర్నమెంట్ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ని కోట్లు పెట్టి ప్లేయర్లను కొనుగోలు చేస్తున్న ఫ్రాంచైజీలకు డబ్బులు ఎలా వస్తున్నాయని అందరికీ ఓ ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. IPL 2024

ఇండియన్ ప్రీమియర్ టీం ఓనర్లకు చాలా రకాలుగా ఆదాయం వస్తుంది. టైటిల్స్ స్పాన్సర్ సంస్థ ఏడాదికి… 500 కోట్ల రూపాయలు చెల్లిస్తే… అందులో 50% బీసీసీఐ, మిగిలినది ఫ్రాంచైజీ ఓనర్లకు వెళ్తాయి. అలాగే స్పాన్సర్లు క్రేడ్, డ్రీం 11 లాంటివి, బ్రాడ్ కాస్టింగ్ సంస్థలు చెల్లించే మొత్తంలోనూ సగం టీం ఓనర్లకే వెళ్తాయి. జెర్సీలపై ఉండే లోగోలకు టీం బ్రాండ్ ను బట్టి ఆదాయం వస్తుంది. హోమ్ గ్రౌండ్ టికెట్లపై వచ్చే ఆదాయంలో 80 శాతం ఫ్రాంచైజీలకు వెళుతుంది. ఇలా అడుగడుగునా ఐపిఎల్ ఓనర్లకు లాభాలే ఉంటాయి. IPL 2024

Join WhatsApp