Sunrisers Hyderabad in danger...play offs hopes lost

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక ఫైట్ జరగనుంది. ఇవాల్టి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య ఫైట్ ఉంది. అయితే ఈ మ్యాచ్లో రెండు చెట్లు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉప్పల్లోని అంతర్జాతీయ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. IPL 2024

Sunrisers Hyderabad in danger play offs hopes lost Over IPL 2024

హోమ్ గ్రౌండ్ కావడంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో గెలుస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ టోర్నమెంటులో హైదరాబాద్ జట్టుపై లక్నో విజయం సాధించింది. ఈ తరుణం లో లక్నో మంచి ఊపులో ఉంది. ఇలాంటి తరుణంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వర్షం భయం నెలకొంది. ఈ మ్యాచ్లో వర్షం పడితే హైదరాబాద్ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయార వుతుంది. IPL 2024

Also Read: Rohit Sharma: RCB కెప్టెన్ గా రోహిత్ శర్మ ?

ప్లే ఆఫ్ అసలు కూడా గల్లంతు అవుతాయి. ఒకవేళ హైదరాబాదులో ఇవాళ వర్షం పడితే మ్యాచ్ రద్దు అవుతుంది. మ్యాచ్ రద్దు అయితే చెరొక పాయింట్ ఇస్తుంది బిసిసిఐ. ఒకవేళ అదే జరిగితే.. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… అదే స్థానంలో లేదా మూడో స్థానానికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అంతే కాదు లక్నో కూడా… హైదరాబాద్ జట్టుకు పోటీగా… మూడు లేదా నాలుగు స్థానంలో నిలిచి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ రెండు జట్ల మధ్య రన్ రేట్ ఆధారంగా ఈ స్థానం ఫైనల్ అవుతుంది.IPL 2024

అంతేకాదు తమ వచ్చే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్… వరుసగా మ్యాచులు గెలిస్తే సన్రైజర్స్ హైదరాబాద్ మరింత కిందికి పడిపోతుంది. ఈ లెక్కన అప్పుడు ఢిల్లీ మరియు చెన్నై ప్లే ఆఫ్ కు వెళ్తాయి. హైదరాబాద్ మరియు లక్నో ఇంటికి వెళ్తాయి. అయితే ఇది జరగ కుండా ఉండాలంటే ఇవాళ కచ్చితంగా హైదరాబాద్ గెలవాలి. ఇక వర్షం పడితే మాత్రం హైదరాబాద్ అసలు గల్లంతు కావడం ఖాయం. IPL 2024

Join WhatsApp