SRH: ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా నిన్న కీలక పోరు జరిగింది. ప్లే ఆఫ్ స్టేజి ముందు తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో… ఒక పరుగు తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… నిర్ణీత  20వ ఓవర్స్ లో మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. SRH

Tollywood anchor anasuya will win the Hyderabad team

అనంతరం బ్యాటింగ్ చేసిన… రాజస్థాన్ రాయల్స్ జట్టు… చివరి వరకు పోరాడింది. వాస్తవానికి రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ భువనేశ్వర్ కుమార్ మ్యాజిక్ తో హైదరాబాద్ విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి కేవలం 200 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. దీంతో ఒక్క పరుగు తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. SRH

Also Read: IPL 2024: CSKకు షాక్.. ఒక్కసారిగా 6 గురు స్టార్ బౌలర్లు దూరం!

ఇది ఇలా ఉండగా హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్లో టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సందడి చేసింది. మ్యాచ్లో సన్రైజర్స్ వికెట్ పడితే.. బాధపడుతూ… నితీష్ రెడ్డి సిక్స్ కొడితే ఎంజాయ్ చేస్తూ కనిపించింది అనసూయ భరద్వాజ్. నిన్నటి మ్యాచ్ కోసం తన కుటుంబంతో ఉప్పల్ స్టేడియానికి వచ్చింది అనసూయ. ఈ సందర్భంగా మ్యాచ్ చూస్తూ హైదరాబాద్ కు సపోర్ట్ చేసింది. SRH

అంతేకాకుండా మ్యాచ్లో జరిగే సంఘటనలు చూస్తూ తన హావాభావాలను వ్యక్తపరిచింది. అయితే మ్యాచ్ చూసేటప్పుడు అనసూయ వేసుకున్న డ్రెస్సు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటిలాగే తన హాట్ అందాలను చూపిస్తూ… సందడి చేసింది అనసూయ భరద్వాజ్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. SRH

Join WhatsApp